ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మిషన్ వాత్సల్య అమలుకు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బాలల రక్షణ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు తదితర..

AP Mission Vatsalya Jobs 2023
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది. కేంద్రప్రభుత్వ ప్రాయోజిత పథకమైన మిషన్ వాత్సల్య అమలుకు కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాల పరిధిలో 423 పోస్టుల భర్తీకి రాష్ట్ర సర్కార్ అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా బాలల రక్షణ యూనిట్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీలు, బాలల సంరక్షణ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డు, బాలల గృహాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో 311 ఒప్పంద విధానంలో, 15 తాత్కాలిక విధానంలో, 97 అవుట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ఇప్పటికే అంగన్‌వాడీ, డీఎమ్‌హెచ్‌వో, పోలీస్ కానిస్టేబుల్, ఎస్‌ఐ, బ్యాక్‌లాగ్, స్టాప్‌నర్స్, ఏపీపీఎస్సీ గ్రూప్ -1.. వంటి పలు ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మిషన్ వాత్సల్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ త్వరలో విడుదల చేయనున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment