TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సంచలనాలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. | Officials have taken action against two employees in TSPSC paper leak case - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 14 March 2023

TSPSC: టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారంలో సంచలనాలు.. వెలుగులోకి సంచలన విషయాలు.. | Officials have taken action against two employees in TSPSC paper leak case

మరో నిందితుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి ని విధులను తొలగించింది. టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు.

పేపర్ లీకేజీకి పాల్పడ్డ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ ను సస్పెండ్ చేసింది టీఎస్‌పీఎస్సీ. మరో నిందితుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డి ని విధులను తొలగించింది. టీఎస్‌పీఎస్సీలో సిస్టమ్‌ అడ్మినిస్ట్రేటర్‌ రాజశేఖర్‌రెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించారు. అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేశారు. గురుకుల ఉపాధ్యాయురాలు రేణుక, ఆమె భర్త డీఆర్‌డీఏలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ ఢాక్య, కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిపై నేడో, రేపో అధికారికంగా చర్యలు తీసుకోనున్నారు. సంచలనం రేపిన టీస్‌పీఎస్సీ ఎగ్జామ్‌ పేపర్‌ లీకేజ్ వ్యవహారంలో చర్యలు మొదలయ్యాయి. పరీక్షా పత్రం లీకేజ్‌ పని ఇంటి దొంగల పనే అని తేలడంతో… కారకులపై సీరియస్‌ యాక్షన్‌ తీసుకున్నారు ఉన్నతాధికారులు. అసిస్టెంట్‌ సెక్షన్ ఆఫీసర్‌ ప్రవీణ్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ వ్యవహారంలో ప్రవీణ్‌కు సహకరించిన మరో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి రాజశేఖర్‌రెడ్డిని సైతం ఉద్యోగం నుంచి తొలిగించారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్‌తో పాటు మరో 9మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ మొత్తం వ్యవహారంలో విడతల వారీగా పదమూడున్నర లక్షల రూపాయలు చేతులు మారినట్లు తేల్చారు. లీకయ్యింది ఏఈ ఎగ్జామ్‌ పేపరేనని తేలిపోయింది. దీంతో, ఈనెల 5న నిర్వహించిన ఈ పరీక్షను రద్దు చేయాలన్న యోచనలో ఉంది టీఎస్‌పీఎస్సీ. 837 పోస్టులకు గాను… 55వేల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇప్పుడీ పేపర్‌ లీకేజ్‌ ఉదంతంతో… మరోసారి పరీక్ష నిర్వహించాలని భావిస్తోంది టీఎస్‌పీఎస్సీ. దీనిపై ఇవాళ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

FSL రిపోర్ట్ వస్తే తప్ప.. ఏఈ పేపర్‌తో పాటు టౌన్ ప్లానింగ్, మిగతావి లీక్ అయ్యాయా లేదా అనేది తేలే అవకాశం లేదు. కాబట్టి, అప్పటిదాకా నిర్ణయం తీసుకునే ఛాన్స్‌ కనిపించడం లేదు. Tspsc ఇచ్చిన కంప్లైంట్ ను బట్టిచూస్తే.. ఏఈ ఎగ్జామ్‌తో పాటు ఇతర పరీక్షల పేపర్లు కూడా లీక్ అయి ఉడొచ్చన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages