TSPSC 2022-23: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. తెలంగాణలో నియామక పరీక్షల తేదీలు ఇలా.. | TSPSC: Telangana recruitment exam dates announced - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 4 March 2023

TSPSC 2022-23: ప్రభుత్వ ఉద్యోగార్థులకు అలర్ట్.. తెలంగాణలో నియామక పరీక్షల తేదీలు ఇలా.. | TSPSC: Telangana recruitment exam dates announced

తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్. ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

తెలంగాణలో ఉద్యోగార్థులకు శుభవార్త. కొలువుల జాతర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్) వెల్లడించింది.  పలు నియామక సంస్థలు ఇప్పటికే భారీగా నోటిఫికేషన్లను విడుదల చేశాయి. అనేక నియామక ప్రక్రియలు కొనసాగుతున్నాయి. ఈనెల 15, 16న వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ నియామక పరీక్ష, ఏప్రిల్‌ 4న హార్టికల్చర్‌ ఆఫీసర్‌, ఏప్రిల్‌ 23న సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) నియామక పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. పశుసంవర్ధక శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్‌ సర్జన్‌ (క్లాస్‌-ఎ అండ్‌ బి) పోస్టులకు, రవాణాశాఖలో 113 సహాయ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఏఎంవీఐ) పోస్టులకు, హార్టికల్చర్‌ ఆఫీసర్‌ 22 పోస్టులకు గతంలో వేర్వేరుగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే నియామక పరీక్షల తేదీలను తాజాగా ఖరారు చేసింది. అయితే, హాల్ టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీలను మాత్రం ప్రకటించలేదు. పూర్తి వివరాలకు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని అభ్యర్థులకు సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages