TS EDCET 2023: ప్రారంభమైన టీఎస్ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. అప్లికేషన్ ఫీజు, చివరి తేది వివరాలివే.. | TS EDCET 2023 Mahatma Gandhi University has started application process check here to apply now and last date of registration details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 9 March 2023

TS EDCET 2023: ప్రారంభమైన టీఎస్ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ.. అప్లికేషన్ ఫీజు, చివరి తేది వివరాలివే.. | TS EDCET 2023 Mahatma Gandhi University has started application process check here to apply now and last date of registration details

అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు రిజస్ట్రేషన్ చేసుకోవ‌చ్చు. అలాగే రూ.250 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు..

తెలంగాణ బీఈడీ కళాశాలల్లో బీఎడ్ కోర్సులో ప్రవేశాల‌కు నిర్వహించే ‘టీఎస్ ఎడ్‌సెట్ – 2023’ నోటిఫికేషన్‌ మార్చి 5న విడుదలైన నేపథ్యంలో.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ప్రారంభమైంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.500, ఇతరులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఆల‌స్య రుసుము లేకుండా ఏప్రిల్ 20 వ‌ర‌కు రిజస్ట్రేషన్ చేసుకోవ‌చ్చు. అలాగే రూ.250 ఆల‌స్య రుసుముతో ఏప్రిల్ 25 వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పించారు. మార్చి 30న అభ్యర్థులు త‌మ ద‌ర‌ఖాస్తుల‌ను ఎడిట్ చేసుకోవ‌చ్చు. మే 5 నుంచి ఎడ్‌సెట్ వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లు అందుబాటులో ఉంటాయి. మే 18న ప్రవేశ ప‌రీక్ష నిర్వహించి, మే 21న ప్రాథ‌మిక కీ విడుద‌ల చేయ‌నున్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించి, తదనంతరం ఫైనల్ కీతో పాటు, ఫలితాలను విడుదల చేస్తారు.

టీఎస్ ఎడ్‌సెట్ – 2023 నోటిఫికేషన్ వివరాలివే.. 

ఎడ్‌సెట్ పరీక్షకు అర్హతలు: 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా పీజీ డిగ్రీ ఉండాలి. 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. డిగ్రీ చివరిసంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అలాగే అభ్యర్థుల వయోపరిమితి, 01.07.2023 నాటికి 19 సంవత్సరాలు నిండాలి. అర్హతలు కలిగినవారు అన్‌లైన్‌లో అధికారిక వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక ప్రవేశ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ క్రమంలో మొత్తం 150 మార్కులకు కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష నిర్వహిస్తారు. వీటిలో మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ (10వ తరగతి వరకు)- 60 ప్రశ్నలు-60 మార్కులు, టీచింగ్ ఆప్టిట్యూడ్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-20 ప్రశ్నలు-20 మార్కులు, జనరల్ నాలెడ్జ్ & ఎడ్యుకేషనల్ ఇష్యూస్-30 ప్రశ్నలు-30 మార్కులు, కంప్యూటర్ అవేర్‌నెస్-20 ప్రశ్నలు-20 మార్కులు. కాగా పరీక్షలో అర్హత మార్కులను 25 శాతం(38 మార్కులు)గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఎలాంటి అర్హత మార్కులు లేవు. అయితే ఎన్‌సీసీ/స్పోర్ట్స్ కోటా/పీహెబ్/ఆర్మ్‌డ్ పర్సనల్ కోటాకు చెందిన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం నిర్ణీత కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు: 

  • TS Ed.CET – 2023 నోటిఫికేషన్ వెల్లడి: 04.03.2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.03.2023.
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 20.04.2023.
  • రూ.250 ఆలస్యరుసుముతో ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 25.04.2023.
  • దరఖాస్తుల సవరణకు అవకాశం: 30.04.2023.
  • పరీక్ష హాల్‌టికెట్ల వెల్లడి: 05.05.2023.
  • TS Ed.CET-2023 పరీక్ష తేది: 18.05.2023.
  • పరీక్ష సమయం: మొదటి సెషన్: 09.00 AM -11.00 AM, రెండో సెషన్: 12.30 PM – 02.30 PM, మూడో సెషన్: 04.00 PM – 06.00 PM
  • ప్రిలిమినరీ కీ విడుదల: 21.05.2023
  • ఆన్సర్ కీపై అభ్యంతరాల స్వీకరణ: 24.05.2023 వరకు.
  • ఫలితాల వెల్లడి: ఇంకా వెల్లడిచలేదు. తేదీని ప్రకటించాల్సి ఉంది.

టీఎస్ ఎడ్‌సెట్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

ఇవి కూడా చదవండి



టీఎస్ ఎడ్‌సెట్ రిజిస్ట్రేషన్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages