TS Edcet 2023 Exam date: తెలంగాణ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం | TS EDCET 2023 Notification released; Online registration begin tomorrow - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 March 2023

TS Edcet 2023 Exam date: తెలంగాణ ఎడ్‌సెట్‌-2023 నోటిఫికేషన్‌ విడుదల.. రేపట్నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం | TS EDCET 2023 Notification released; Online registration begin tomorrow

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎడ్‌సెట్-2023 రేపట్నుంచి..

తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) 2023 నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎడ్‌సెట్-2023 రేపట్నుంచి ప్రారంభమవుతుంది. ఈమేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఛైర్మన్‌ ఆచార్య లింబాద్రి, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఉపకులపతి, ఎడ్‌సెట్‌ ఛైర్మన్‌ ఆచార్య గోపాల్‌రెడ్డి, కన్వీనర్‌ ఆచార్య రామకృష్ణ దరఖాస్తుల షెడ్యూల్‌ను మార్చి 4న విడుదల చేశారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్‌సీ, ఎస్‌టీ, వికలాంగ అభ్యర్ధులు రూ.500, ఇతరులు రూ.700 దరఖాస్తు ఫీజు చెల్లించాలని నిర్ణయించినట్లు లింబాద్రి తెలిపారు.

కాగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో రెండు సంవత్సరాల BEd రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశాలకు గానూ తెలంగాణ ఉన్నత విద్యామండలి (TSCHE) తరపున ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎడ్‌సెట్‌ నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మే 18వ తేదీన ఎడ్‌సెట్‌ రాత పరీక్షను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించనున్నారు. ఇతర వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages