PGCIL Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక. | PGCIL recruitment 2023 Power grid corporation invites applications for engineer trainee posts Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 28 March 2023

PGCIL Recruitment: బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక. | PGCIL recruitment 2023 Power grid corporation invites applications for engineer trainee posts Telugu Education News

బీటెక్‌ పూర్తి చేసిన వారికి శుభవార్త. బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా

బీటెక్‌ పూర్తి చేసిన వారికి శుభవార్త. బీటెక్‌ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగం సొంతం చేసుకునే అవకాశం. ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా పలు విభాగాల్లో ఉన్న ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 138 ఇంజనీర్‌ ట్రెయినీ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఎలక్ట్రానిక్స్ / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్ & ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ / టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్ సైన్స్/ కంప్యూటర్ ఇంజినీరింగ్‌/ ఐటీ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎలక్ట్రికల్‌, సివిల్‌, ఎలక్ట్రానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాల్లో బీఈ/ బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు గేట్‌ 2023 అర్హత సాధించి ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ. 500 చెల్లించాలి.

* అభ్యర్థులను గ్రూప్‌ డిస్కషన్‌/ ఇంటర్వ్యూలో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణకు 18-041-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages