బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేసే మెట్రో రైల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల…
బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త ఆధ్వర్యంలో పనిచేసే మెట్రో రైల్ కార్పొరేషన్‌లో పలు పోస్టుల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 26 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* వీటిలో డిప్యూటీ చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10+2 ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 25 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకొని అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని ఆఫ్‌లైన్ విధానంలో పంపించాలి.
* దరఖాస్తులను జనలర్ మేనేజర్, బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్, 3వ అంతస్తు, బీఎమ్‌టీసీ కాంప్లెక్స్, శాంతినగర్, బెంగళూరు 560027 అడ్రస్‌కు పంపించాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తార.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 25,000 జీతంగా అందిస్తారు.
* దరఖాస్తుల స్వీకరణకు 20-04-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి..
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment