MCEME Secunderabad: సికింద్రాబాద్‌ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా.. | MCEME Secunderabad Recruitment 2023 for Laboratory Attendant, Junior Laboratory Assistant and other posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 22 March 2023

MCEME Secunderabad: సికింద్రాబాద్‌ మిలిటరీ కాలేజీలో ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే రాత పరీక్షలేకుండా నేరుగా.. | MCEME Secunderabad Recruitment 2023 for Laboratory Attendant, Junior Laboratory Assistant and other posts

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (MCEME).. ల్యాబొరేటరీ అటెండెంట్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌..

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని తిరుమలగిరిలోనున్న మిలిటరీ కాలేజీ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ (MCEME).. ల్యాబొరేటరీ అటెండెంట్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, లైబ్రరీ అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి 12వ తరగతి/ఇంజినీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీ/డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో 2 నుంచి 8 ఏళ్ల అనుభవం ఉండాలి.

అర్హత కలిగిన అభ్యర్ధులు మర్చి 31, 2023వ తేదీలోపు ఎంసీఈఎంఈ గేట్‌ వద్ద ఉన్న డ్రాప్‌బాక్స్‌లో దరఖాస్తులు సమర్పించాలి. అనంతరం ఏప్రిల్‌ 5వ తేదీన కింది అడ్రస్‌లో నిర్వహించే ఇంటర్వ్యూకి హాజరుకావల్సి ఉంటుంది. ఎంపికైన వారికి పోస్టును బట్టి నెలకు రూ.15,900ల నుంచి రూ.19,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్..

FDC, MCEME, Secunderabad, Telangana.

ఇవి కూడా చదవండి



అధికారిక వెబ్‌సైట్‌ కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages