జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రెసిడెంట్ పోస్టులను..
జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. నోటిఫికేషన్‌లో భాగంగా జూనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీబీఎస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు మార్చి 24, 2023 నాటికి 40 ఏళ్లు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* అభ్యర్థులు రూ. 300 అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.
* దరఖాస్తుల స్వీకరణకు 24-03-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.
* ఇంటర్వ్యూలను మార్చి 31వ తేదీన నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..
No comments:
Post a Comment