Group 1 Free Coaching: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | Karimnagar BC Study Circle invites applications for Group 1 Free Coaching - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 March 2023

Group 1 Free Coaching: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | Karimnagar BC Study Circle invites applications for Group 1 Free Coaching

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గ్రూప్‌ 1తోపాటు పలు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ కొత్త పరీక్ష తేదీని కూడా కమిషన్‌ ప్రకటించింది..

Group 1 Free Coaching: తెలంగాణ గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌కు ఉచిత కోచింగ్‌.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Karimnagar BC Study Circle

ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో గ్రూప్‌ 1తోపాటు పలు పరీక్షలను టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన సంగతి తెలిసిందే. గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ కొత్త పరీక్ష తేదీని కూడా కమిషన్‌ ప్రకటించింది. జూన్‌ 11 పరీక్ష నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది. ఐతే తాజాగా బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-1 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కరీంనగర్‌ బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం రవికుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

ఆసక్తిగల కలిగిన అభ్యర్ధులు మార్చి 28వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల్లో గతంలో ఇదే శిక్షణ కేంద్రలో శిక్షణ పొందిన వారు అనర్హులని వివరించారు. దరఖాస్తుదారలు కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. పదోతరగతి, ఇంటర్, డిగ్రీలలో ఫస్ట్‌ క్లాస్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఇతర వివరాలకు కరీంనగర్‌లోని స్టడీ సర్కిల్‌లో సంప్రదించాలని రవికుమార్ వివరించారు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages