GATE 2023 Results: గేట్‌-2023 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి | GATE 2023 Result Announced; check here directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday 17 March 2023

GATE 2023 Results: గేట్‌-2023 ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ ఇలా చెక్‌ చేసుకోండి | GATE 2023 Result Announced; check here directly

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్ ఇంజనీరింగ్‌ (గేట్)- 2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్‌ గురువారం (మార్చి 16) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు..

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్ ఇంజనీరింగ్‌ (గేట్)- 2023 ఫలితాలను ఐఐటీ కాన్పూర్‌ గురువారం (మార్చి 16) విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ లాగిన్‌ వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఏడాది ఫిబ్రవరి 4, 5, 11, 12 తేదీల్లో గేట్‌ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నాలుగు రోజుల్లో రెండు సెషన్ల చొప్పున పరీక్ష జరిగాయి. ఈ పరీక్షకు దాదాపు ఎనిమిది లక్షల మంది విద్యార్ధులు హాజరయ్యారు.

గేట్‌-2023లో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీలు, నిట్‌ వంటి విద్యాసంస్థల్లో మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ కోర్సుల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. గేట్‌ స్కోర్‌ ఆధారంగా ఉన్నత విద్యతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల ఎంపికకు ఉపయోగపడుతుంది. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages