AP Group-1 Mains: మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం | APPSC to begin Registration from March 6 For Main Written Exam under Group I Services - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 March 2023

AP Group-1 Mains: మార్చి 6 నుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభం | APPSC to begin Registration from March 6 For Main Written Exam under Group I Services

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు జనవరి 27న విడుదలైన సంగతి తెలిసిందే. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. వీరందరూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను..

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష ఫలితాలు జనవరి 27న విడుదలైన సంగతి తెలిసిందే. 1:50 నిష్పత్తిలో మెయిన్స్‌కు ఎంపిక చేశారు. వీరందరూ గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను ఏ మాధ్యమంలో రాస్తారు, పోస్టు, జోనల్‌ ప్రాధాన్యత, ఏ సెంటర్‌లో పరీక్ష రాయాలనుకుంటున్నారు వంటి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌ లో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవల్సి ఉంటుంది. అందుకు మార్చి 6 నుంచి 15వ తేదీ వరకు అవకాశం కల్పించినట్లు ఏపీపీఎస్సీ శనివారం (మార్చి 4) ప్రకటనలో తెలిపింది.

కాగా మొత్తం 111 గ్రూప్‌ 1 పోస్టులకు ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టింది. ఇప్పటికే ప్రాథమిక రాత పరీక్ష నిర్వహించింది. రెండో దశ అయిన మెయిన్స్‌ పరీక్షలను ఏప్రిల్‌ 23 నుంచి 29 వరకు నిర్వహించనున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages