తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మరో 9 కొత్త కాలేజీలు. మొత్తం సీట్ల సంఖ్య ఎంతకు చేరనుందంటే.. | Minister Harish Rao has directed the officials to speed up the establishment of 9 new medical colleges in Telangana by the end of this year - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 March 2023

తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మరో 9 కొత్త కాలేజీలు. మొత్తం సీట్ల సంఖ్య ఎంతకు చేరనుందంటే.. | Minister Harish Rao has directed the officials to speed up the establishment of 9 new medical colleges in Telangana by the end of this year

తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు శుభవార్త త్వరలోనే రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..

తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు గుడ్‌ న్యూస్‌.. త్వరలోనే మరో 9 కొత్త కాలేజీలు. మొత్తం సీట్ల సంఖ్య ఎంతకు చేరనుందంటే..

Medical Coleges In Telangana

తెలంగాణలో మెడికల్ విద్యార్థులకు శుభవార్త త్వరలోనే రాష్ట్రంలో మరో 9 కొత్త మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేయబోయే తొమ్మిది మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేయాలని ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఏడాదికి గాను రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే మెడికల్ కాలేజీల పై శనివారం ఎంసిహెచ్ఆర్‌డీలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ.. ‘9 మెడికల్ కాలేజీలు ప్రారంభించే లక్ష్యంలో భాగంగా ఇప్పటికే 67 మందికి ప్రమోషన్లు ఇచ్చాము. 210 మంది అసోసియేట్ ప్రొఫెసర్‌లకు వారం రోజుల్లో కౌన్సిలింగ్ ద్వారా పోస్టింగ్ ఇవ్వాలని నిర్ణయించాము. 442 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియ చివరి దశకు చేరింది, రెండు మూడు రోజుల్లో ప్రోవిసనల్ మెరిట్ లిస్టు విడుదల చేసి, 10 రోజుల్లో తుది నియామక పత్రాలు అందించేలా చర్యలు తీసుకుంటాము’ అని చెప్పుకొచ్చారు.

కౌన్సిలింగ్ నిర్వహించి 9 మెడికల్ కాలేజీల్లో వీరిని నియమించాలని మంత్రి ఆదేశించారు. 9 మెడికల్ కాలేజీల విషయంలో సమన్వయం కోసం మంత్రులు ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, అజయ్ కుమార్‌తో పాటు పలు జిల్లా కలెక్టర్లతో మంత్రి మాట్లాడారు. 9 కాలేజీల్లో వైద్య విద్యార్థులకు అవరమయ్యే హాస్టల్ వసతి సహా అన్ని కల్పించాలనీ అధికారులను ఆదేశించారు. తరగతులు ప్రారంభం అయ్యే నాటికి అవసరమైన ఫర్నీచర్, ఎక్విప్మెంట్ సిద్దం చేయాలని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్ గారి మార్గానిర్దేశనంలో గతేడాది 8 మెడికల్ కాలేజీలు ఒకేసారి ప్రారంభించి రికార్డు సృష్టించామని, ఇదే స్ఫూర్తితో ఈ ఏడాది కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, నిర్మల్, భూపాలపల్లి, సిరిసిల్ల, ఆసిఫాబాద్ జిల్లాల్లో ఎంబీబీఎస్ అకడమిక్ ఇయర్ ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

అన్ని కాలేజీలు నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి అనుమతులు పొందేలా సిద్దంగా ఉండాలని మంత్రి తెలిపారు. ఎన్ఎంసి నిబంధనలు సంతృప్తి చెందే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లోపాలు లేకుండా చూడాలన్నారు. నేషనల్ మెడికల్ కమిషన్ బృందం పరిశీలనకు వస్తున్న నేపథ్యంలో పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు మంత్రి ఈ సందర్బంగా కోరారు. మెడికల్ కాలేజీల పనులు వేగవంతం చేసేందుకు గాను, ఈనెల 28 న ఆయా9 జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్, ఇంజినీర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నట్లు తెలిపారు. వచ్చే వారం రోజుల్లో 9 కొత్త మెడికల్ కాలేజీలు సందర్శించి, పనులు వేగిరం చేసేలా చర్యలు తీసుకోవాలని డీ ఎం ఇ రమేష్ రెడ్డి నీ మంత్రి ఆదేశించారు.

ఇవి కూడా చదవండిHarish Rao

26కి చేరనున్న మెడికల్ కాలేజీల సంఖ్య..

వచ్చే జూలై ఆగస్టు నాటికి అకడమిక్ ఇయర్ ప్రారంభం అయితే కొత్తగా 9 జిల్లాల్లో విద్య, వైద్యం ప్రజలకు మరింత చేరువ అవుతుంది అన్నారు. ఈ ఏడాది 9 మెడికల్ కాలేజీలు సాధిస్తే, రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య 26 కు చేరుతుందని, ఎంబీబీఎస్‌ సీట్ల సంఖ్య 3690కి పెరుగుతుందని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 5 మెడికల్ కాలేజీలు ఉంటే, ఇప్పుడు 26 కు చేరుతుండటం వైద్యం, విద్యను బలోపేతం చేయాలన్న సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనమని హరీష్‌ రావు అన్నారు. 60 ఏళ్లలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే, గడిచిన 8, 9 ఏళ్లలో 21 మెడికల్ కాలేజీలు రావడం గొప్ప విషయం అన్నారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదనీ, అయినప్పటికీ వెనుకాడకుండా సీఎం కేసీఆర్ గారు ప్రజలకు వైద్యం, వైద్య విద్యను చేరువ చేసేందుకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. దీనికి అనుగుణంగా వేగవంతమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages