UPSC Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. | UPSC Recruitment 2023 for 73 Foreman, Deputy Director of Employment and other Posts, Apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 13 February 2023

UPSC Recruitment 2023: కేంద్ర ప్రభుత్వ శాఖలో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌.. ఈ అర్హతలున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.. | UPSC Recruitment 2023 for 73 Foreman, Deputy Director of Employment and other Posts, Apply online

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 73 ఫోర్‌మాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ తదితర..

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో.. రెగ్యులర్‌ ప్రాతిపదికన 73 ఫోర్‌మాన్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్, లేబర్ ఆఫీసర్ (లేబర్ డిపార్ట్‌మెంట్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పోస్టును బట్టి ఏరోనాటికల్/ కెమికల్/ కంప్యూటర్- ఐటీ/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్/ మెటలర్జీ/ టెక్స్‌టైల్ లేదా తత్సమాన స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 2, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రిక్రూట్‌మెంట్‌ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • ఫోర్‌మాన్ పోస్టులు: 13
  • డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ పోస్టులు: 12
  • అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ పోస్టులు: 47
  • లేబర్ ఆఫీసర్ (లేబర్ డిపార్ట్‌మెంట్) పోస్టులు: 1

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages