UPSC EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌ఓలో 557 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే అర్హతలుండాలంటే.. | UPSC Recruitment 2023 for 557 Assistant Provident Fund Commissioner and Enforcement Officer/Accounts Officer Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 26 February 2023

UPSC EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌ఓలో 557 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే అర్హతలుండాలంటే.. | UPSC Recruitment 2023 for 557 Assistant Provident Fund Commissioner and Enforcement Officer/Accounts Officer Posts

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)..557 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్‌సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

UPSC EPFO Recruitment 2023: ఈపీఎఫ్‌ఓలో 557 ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. ఏయే అర్హతలుండాలంటే..

UPSC EPFO Recruitment 2023

యూనియన్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ)..557 ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్‌సీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఏ అర్హతలుండాలంటే.. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఏదైనా డిగ్రాలో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. దరఖాస్తుదారుల వయసు ఈవో/ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్‌సీ పోస్టులకు 35 ఏళ్లకు మించకుండా ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 17, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్ కేటగిరి అభ్యర్ధులు రూ.25 రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ/మహిళా అభ్యర్ధులు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నిబంధనల మేరకు జీతభత్యాలు చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్/ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు: 418
అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పోస్టులు: 159 పోస్టులు

ఇవి కూడా చదవండి



నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages