TSSPDCL Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. | TSSPDCL Recruitment 2023 for 48 Assistant Engineer Posts, Check full details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 18 February 2023

TSSPDCL Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్‌.. టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల.. | TSSPDCL Recruitment 2023 for 48 Assistant Engineer Posts, Check full details here

తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌..

తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్‌).. డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌ స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయసు తప్పనిసరిగా 18 నుంచి 44 యేళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 15, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్‌ కేటగిరీ అభ్యర్ధులు రూ.320లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష ఏప్రిల్‌ 30న జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,295ల నుంచి రూ.99,345ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages