TS Inter: ఎగ్జామ్స్‌ వాల్యుయేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. టెండర్‌ రద్దు చేస్తూ.. | The Inter Board has taken a decision canceling the tender called for Telangana Intermediate Online Valuation Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 February 2023

TS Inter: ఎగ్జామ్స్‌ వాల్యుయేషన్‌ విషయంలో ఇంటర్‌ బోర్డ్‌ కీలక నిర్ణయం.. టెండర్‌ రద్దు చేస్తూ.. | The Inter Board has taken a decision canceling the tender called for Telangana Intermediate Online Valuation Telugu Education News

తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. దీంతో బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. మళ్లీ టెండర్లు పిలవాలని..

తెలంగాణ ఇంటర్మీడియేట్‌ ఆన్‌లైన్ వాల్యుయేషన్‌కి పిలిచిన టెండర్ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాల్యూయేషన్ చేసేందుకు ఒకే ఒక్క కంపెనీ ముందుకొచ్చింది. దీంతో బిడ్లు రాకపోవడంతో పిలిచిన టెండర్ రద్దు చేస్తూ ఇంటర్‌ బోర్డ్‌ నిర్ణయం తీసుకుంది. మళ్లీ టెండర్లు పిలవాలని చూస్తున్నారు. గతంలో పరీక్షా పేపర్ల మూల్యాంకనంలో గ్లోబరేనా సంస్థ అనేక విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈసారి అదే కంపెనీ పేరు మార్చి బిడ్ వేస్తుందని అనుమానం వ్యక్తం చేశారు. అయితే గ్లోబరీనా సంస్థ మాత్రం అలాంటి ప్రయత్నాలు చెయ్యలేదని క్లారిటీ ఇచ్చేసింది.

ఇదిలా ఉంటే గ్లోబరేనా సంస్థ చేసిన తప్పిదాలు వల్లే ఎంతో మంది విద్యార్థులకు మార్కులు తప్పులతడకగా పడినట్టు గతంలో ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇంటర్ విద్యా మండలి ఆన్‌లైన్‌ వాల్యూయేషన్ కోసం జారీ చేసిన టెండర్స్‌ను రద్దు చేయడంపై తాజాగా డాక్టర్ పి మధుసూదన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇక ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ టెండర్లకి సంబంధించి మౌలికమైన మార్పులు చేసి అనుభవం ఉన్న సంస్థలతో ఆన్‌లైన్‌ వాల్యుయేషన్‌ని దశలవారీగా అమలు చేయాలని ఇంటర్ విద్య జేఏసి చైర్మన్ అన్నారు. అలాగే ఆన్‌లైన్‌ వాల్యుయేషన్ పట్ల అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, ప్రయోగాత్మక పద్ధతిని మే నెలలో జరగబోయే అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ పేపర్స్ వ్యాల్యుయేషన్ నుంచి అమలు చేయాలని ఇంటర్ బోర్డుకు సూచించారు.

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages