TS EAMCET 2023: విద్యార్థులకు అలర్ట్‌.. ఎంసెట్‌ 2023 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు. | Telangana entrance exams for various courses tentative dates released incuding Eamcet, ECET, PGECET Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 7 February 2023

TS EAMCET 2023: విద్యార్థులకు అలర్ట్‌.. ఎంసెట్‌ 2023 పరీక్షల షెడ్యూల్‌ వచ్చేసింది.. పూర్తి వివరాలు. | Telangana entrance exams for various courses tentative dates released incuding Eamcet, ECET, PGECET Telugu Education News

తెలంగాణలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశం కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 07 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు…

Telangana entrance exam Dates: తెలంగాణలో వివిధ ప్రొఫెషనల్‌ కోర్సులలో ప్రవేశం కోసం 2023-24 విద్యా సంవత్సరానికి గాను ఎమ్‌సెట్‌తో పాటు మరికొన్ని ప్రవేశ పరీక్షల తేదీలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా మొత్తం 07 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేశారు. జేఎన్టీయూ నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌ 2023 పరీక్షలను ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్ష మే 7 నుంచి 11 వరకు నిర్వహించనున్నారు.

ఎంసెట్ అగ్రీ అండ్ ఫార్మా విభాగం మే 12 నుంచి 14 వరకు నిర్వహిస్తారు. వీటితో పాటు టీఎస్‌ ఎడ్‌సెట్‌ మే 18, టీఎస్‌ ఈసీఈటీ మే 20వ తేదీ, టీఎస్‌ లాసెట్‌ మే 25వ తేదీన, టీఎస్‌ ఐసెట్‌ మే 26,27 తేదీల్లో, టీఎస్‌ పీజీఈసెట్‌ను మే 29, 30, 31, జూన్ 1 నిర్వహించనున్నట్లు అధికారులు పలికారు.

అన్ని రకాల ప్రవేశ పరీక్షలకు సంబంధించిన తేదీలను మంత్రి సబిత ఇంద్రారెడ్డి విడుదల చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రవేశ పరీక్షలకు సంబంధించి తన కార్యాలయంలో వాకాటి కరుణ, విద్యాశాఖ కార్యదర్శి, ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి, చైర్మన్‌, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రొ. వి. వెంకట రమణ, వైస్‌-ఛైర్మన్‌తో పాటు ఇతర అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పరీక్షలను సుజువుగా నిర్వహించేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సూచించారు.

Ts Exams

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages