Non Teaching Jobs: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 388 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ అర్హత.. | Jawaharlal Nehru University Recruitment 2023 for 388 Non Teaching Posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 20 February 2023

Non Teaching Jobs: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 388 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ అర్హత.. | Jawaharlal Nehru University Recruitment 2023 for 388 Non Teaching Posts

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. 388 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

Non Teaching Jobs: జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో 388 నాన్ టీచింగ్ ఉద్యోగాలు.. టెన్త్‌/ఇంటర్‌/డిగ్రీ అర్హత..

Jawaharlal Nehru University

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ.. 388 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. సంబంధిత స్పెషలైజేషన్‌లో పదో తరగతి/ఇంటర్మీడియట్‌/బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ/ఐటీఐ డిప్లొమా/బీఈ/బీటెక్‌/బీఎస్సీ/బీపీఈడీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొందిన వారు ఎవరైన దరఖాస్తు చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్‌ పోస్టులకు ఇంగ్లిష్‌/హిందీలో స్టెనోగ్రఫీ ఉండాలి. కంప్యూటర్‌ నైపుణ్యాలు అవసరం. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 40 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 10, 2023వ తేదీ రాత్రి 11 గంటల 59 నిముషాలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో జనరల్/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్దులు గ్రూప్‌ ‘ఏ’ పోస్టులకు రూ.1500, గ్రూప్‌ ‘బీ’ పోస్టులకు రూ.1000లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు గ్రూప్‌ ‘ఏ’ పోస్టులకు రూ.1000, గ్రూప్‌ ‘బీ’ పోస్టులకు రూ.600లు అప్లికేషన్‌ ఫీజు కింద చెల్లించవల్సి ఉంటుంది. వికలాంగ అభ్యర్ధులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు: 2
  • అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు: 3
  • పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు: 1
  • సెక్షన్ ఆఫీసర్ పోస్టులు: 8
  • సీనియర్ అసిస్టెంట్ పోస్టులు: 8
  • అసిస్టెంట్ పోస్టులు: 3
  • జూనియర్ అసిస్టెంట్ పోస్టులు: 106
  • మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు: 79
  • ప్రైవేట్ సెక్రటరీ పోస్టులు: 1
  • పర్సనల్ అసిస్టెంట్ పోస్టులు: 6
  • స్టెనోగ్రాఫర్ పోస్టులు: 22
  • రిసెర్చ్ ఆఫీసర్ పోస్టులు: 2
  • ఎడిటర్ పబ్లికేషన్ పోస్టులు: 2
  • క్యూరేటర్ పోస్టులు: 1
  • అసిస్టెంట్ లైబ్రేరియన్ పోస్టులు: 1
  • ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ పోస్టులు: 8
  • కుక్ పోస్టులు: 19
  • మెస్ హెల్పర్ పోస్టులు: 49
  • అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్) పోస్టులు: 1
  • జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టులు: 1
  • వర్క్స్ అసిస్టెంట్ పోస్టులు: 16
  • ఇంజినీరింగ్ అటెండెంట్ పోస్టులు: 22
  • లిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు: 3
  • సీనియర్ సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 1
  • సిస్టమ్ అనలిస్ట్ పోస్టులు: 2
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు: 1
  • టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • జూనియర్ టెక్నీషియన్ పోస్టులు: 1
  • జూనియర్ ఆపరేటర్ పోస్టులు: 2
  • స్టాటిస్టికల్ అసిస్టెంట్ పోస్టులు: 2
  • టెక్నీషియన్-ఎ పోస్టులు: 1
  • అసిస్టెంట్ మేనేజర్(గెస్ట్ హౌస్) పోస్టులు: 1
  • కార్టోగ్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • ల్యాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు: 3
  • ల్యాబొరేటరీ అటెండెంట్ పోస్టులు: 2
  • స్టాఫ్ నర్స్ పోస్టులు: 1
  • స్పోర్ట్స్ అసిస్టెంట్ పోస్టులు: 1
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్ ఆఫీసర్ పోస్టులు: 1

నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి



పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages