Layoffs: ఇది మరీ దారుణం.. ఆ కారణం చెప్పి 600 మంది ఉద్యోగులను తొలగించిన భారత టెక్‌ దిగ్గజం. | According to reports infosys layoff 600 freshers because they fail internal assessment Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 7 February 2023

Layoffs: ఇది మరీ దారుణం.. ఆ కారణం చెప్పి 600 మంది ఉద్యోగులను తొలగించిన భారత టెక్‌ దిగ్గజం. | According to reports infosys layoff 600 freshers because they fail internal assessment Telugu Education News

ఈ ఆర్థిక మంద్యం ఏంటో కానీ ప్రపంచవ్యాప్తగా ఉద్యోగుల పరిస్థితి దిన దిన గండం అన్నట్లు మారింది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న వాళ్లని కూడా నిర్ధాక్షణ్యంగా…

ఈ ఆర్థిక మంద్యం ఏంటో కానీ ప్రపంచవ్యాప్తగా ఉద్యోగుల పరిస్థితి దిన దిన గండం అన్నట్లు మారింది. ఎప్పుడు ఏ కంపెనీ ఉద్యోగులను తొలగిస్తుందో అన్న ఆందోళనలు నెలకొన్నాయి. పదేళ్ల అనుభవం ఉన్న వాళ్లని కూడా నిర్ధాక్షణ్యంగా తొలగిస్తున్నారు. కంపెనీలపై ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడం కోసం కంపెనీలు ఉద్యోగుల తొలగింపే ఏకైక మార్గంగా భావిస్తోన్న తరుణంలో తాజాగా ఇన్ఫోసిస్‌ తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఐటీ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి నిదర్శనంగా నిలిచింది.

గత కొన్ని రోజుల క్రితం ఇన్ఫోసిస్‌ వందల మంది ఫ్రెషర్లను తీసుకుంది. వీరిని ఇంకా ప్రాజెక్ట్‌ మీదికి తీసుకెళ్లలేదు కంపెనీ. అయితే తాజాగా ఆర్థిక మాంద్యం వార్తల నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ ఫ్రెషర్స్‌ను తొలగిస్తూ సంచనలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఇంటర్నల్‌ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరుతో ఓ పరీక్షను నిర్వహించిన ఇన్ఫోసిస్‌.. అందులో ఫెయిల్‌ అయిన 600 మంది ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు ప్రాజెక్ట్‌పైకి వెళ్తామని ఆశిస్తున్న అభ్యర్థుల ఆశలను కంపెనీ నిరాశ పరించింది.

ఇన్ఫోసిస్‌ తెలిగించిన అభ్యర్థుల్లో ఓ అభ్యర్థి మాట్లాడుతూ.. 2022 ఆగస్టులో తాను కంపెనీలో పనిచేయటం ప్రారంభించినట్లు ఫ్రెషర్ వెల్లడించాడు. తనకు కంపెనీ SAP ABAP స్ట్రీమ్ కోసం శిక్షణ ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. ఇంటర్నల్ ఫ్రెషర్‌ అసెస్‌మెంట్ పేరుతో నిర్వహించిన పరీక్షలో తనతో పాటు 150 మంది పాల్గొనగా వారిలో కేవలం 60 మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. దీంతో మిగతా వారందరినీ కంపెనీ తొలగించిందని, గత కొన్ని నెలల నుంచి సుమారు 600 మందికి ఇంటికి పంపారని సదరు ఉద్యోగి తన బాధను చెప్పుకొచ్చాడు.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages