Govt Jobs: నిజంగానే అగ్ని పరీక్ష.. ఒకే రోజు మూడు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. తలలు పట్టుకుంటోన్న అభ్యర్థులు. | On february 26th, major government exams like TSPSC, DAO and SSC Exams are to held, candidates are worried which they should write - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 7 February 2023

Govt Jobs: నిజంగానే అగ్ని పరీక్ష.. ఒకే రోజు మూడు ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు.. తలలు పట్టుకుంటోన్న అభ్యర్థులు. | On february 26th, major government exams like TSPSC, DAO and SSC Exams are to held, candidates are worried which they should write

ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల అవుతున్నాయి. దీంతో అభ్యర్థులు అన్ని పరీక్షలకు సిద్ధమవుతూ వీలైనంత వరకు అన్నింటికి హాజరుకావాలనే ఉద్దేశంతో..

ప్రస్తుతం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనూ వరుసగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్‌ విడుదల అవుతున్నాయి. దీంతో అభ్యర్థులు అన్ని పరీక్షలకు సిద్ధమవుతూ వీలైనంత వరకు అన్నింటికి హాజరుకావాలనే ఉద్దేశంతో ఉంటున్నారు. అయితే ఇదే సమయంలో పరీక్షల తేదీలకు సంబంధించి అభ్యర్థులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తాజాగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థులకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహిస్తుండడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు అభ్యర్థులు.

ఇంతకీ విషయమేంటంటే.. ఫిబ్రవరి 26వ తేదీన తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ డీఏఓ (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) ఉద్యోగ అర్హత పరీక్ష నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 53 పోస్టులను భర్తీ చేయనుంది. దీనికి సుమారు లక్షకుపైగా మంది అభ్యర్థులు దరఖాస్ఉత చేసుకున్నారు. అయితే ఇదే సమయంలో 26వ తేదీనే.. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్‌ (పీఆర్‌టీ) ఉద్యోగ అర్హత పరీక్ష ఉంది. అదే విధంగా అదే రోజు స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ జూనియర్‌ ఇంజనీర్‌ పేపర్‌–2 పరీక్షను సైతం నిర్వహిస్తోంది.

ఇలా ఒకే రోజు మూడు పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో అభ్యర్థులు ఏ పరీక్షను వదులుకోవాలో తెలియని పరిస్థితి నెలకొంది. అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని పరీక్షల తేదీని మార్చాలని కోరుతున్నారు. అభ్యర్థుల ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే పరీక్షను వాయిదా వేయాలని అభిప్రాయపడుతున్నారు. మరి తెలంగాణ ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి



మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages