Coal India Jobs 2023: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 504 ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతో కేంద్ర కొలువులు.. | South Eastern Coalfields Limited Recruitment 2022 for 405 Mining Sirdar, Deputy Surveyor Posts. Check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 2 February 2023

Coal India Jobs 2023: సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో 504 ఉద్యోగాలు.. పదో తరగతి అర్హతతో కేంద్ర కొలువులు.. | South Eastern Coalfields Limited Recruitment 2022 for 405 Mining Sirdar, Deputy Surveyor Posts. Check details

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కోల్‌ మైనింగ్లలో పని చేయుటకు 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి..

భారత ప్రభుత్వ బొగ్గు గనుల మంత్రిత్వశాఖకు చెందిన బిలాస్‌పూర్‌లోని సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్.. ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కోల్‌ మైనింగ్లలో పని చేయుటకు 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణతతోపాటు మైనింగ్ సిర్దార్ షిప్ సర్టిఫికెట్‌/ఫస్ట్‌ ఎయిడ్‌ అండ్‌ గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికేట్/సర్వే సర్టిఫికేట్/సంబంధిత ట్రేడుల్లో డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. జనవరి 30, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో ఫిబ్రవరి 23, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 3వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.1180లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/వికలాంగ/మహిళా అభ్యర్థులు ఫీజు చెల్లించనవసరం లేదు. రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, రిజర్వేషన్‌ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు రూ.31,852ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages