Cantonment Board: 7వ/10వ/12వ తరగతి అర్హతతో పూనె కంటోన్మెంట్‌ బోర్డులో 168 ఉద్యోగాలు.. నెలకు రూ.1,32,300ల జీతం పొందే అవకాశం | Pune Cantonment Board Recruitment 2023 for 168 Computer Programmer, Junior Clerk and other posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 February 2023

Cantonment Board: 7వ/10వ/12వ తరగతి అర్హతతో పూనె కంటోన్మెంట్‌ బోర్డులో 168 ఉద్యోగాలు.. నెలకు రూ.1,32,300ల జీతం పొందే అవకాశం | Pune Cantonment Board Recruitment 2023 for 168 Computer Programmer, Junior Clerk and other posts

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంటోన్మెంట్ బోర్డు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 168 కంప్యూటర్ ప్రోగ్రామర్, వర్క్‌షాప్ సూపరింటెండెంట్, ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్ తదితర..

కేంద్ర ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన కంటోన్మెంట్ బోర్డు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 168 కంప్యూటర్ ప్రోగ్రామర్, వర్క్‌షాప్ సూపరింటెండెంట్, ఫైర్ బ్రిగేడ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ మార్కెట్ సూపరింటెండెంట్, డిస్ఇన్‌ఫెక్టర్, డ్రస్సర్, డ్రైవర్, జూనియర్ క్లర్క్, హెల్త్ సూపర్‌వైజర్, ల్యాబ్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆయ పోస్టును బట్టి 7వ తరగతి, పదో తరగతి, 12వ తరగతి, డిప్లొమా, సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, బీఈ/బీటెక్‌, ఎంబీబీఎస్‌ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 ఏళ్లకు మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్న వారు ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో మార్చి 24, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. దరఖాస్తు సమయంలో జనరల్ అభ్యర్ధులు రూ.600లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్ధులు రూ.400లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.15,000ల నుంచి రూ. 1,32,300ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

The Chief Executive Officer, Office of the Pune Cantonment Board, Golibar Maidan, Pune 411001

ఇవి కూడా చదవండి



నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages