AP Anganwadi Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌లో 115 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు.. | Andhra Pradesh Kadapa District Recruitment 2023 for 115 Anganwadi worker, helper and mini Anganwadi worker posts - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 2 February 2023

AP Anganwadi Jobs 2023: ఆంధ్రప్రదేశ్‌లో 115 అంగన్‌వాడీ ఉద్యోగాలు.. పది/ఏడో తరగతిలో పాసైన మహిళలు అర్హులు.. | Andhra Pradesh Kadapa District Recruitment 2023 for 115 Anganwadi worker, helper and mini Anganwadi worker posts

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ల్లో భాగంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో.. 115 అంగన్‌వాడీ వర్కర్, అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తప్పనిసరిగా పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అంగన్‌వాడీ హెల్పర్, మినీ అంగన్‌వాడీ వర్కర్ పోస్టులకు ఏడో తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళలై ఉండాలి. జులై 1, 2023వ తేదీ నాటికి అభ్యర్ధుల వయసు 21 నుంచి 35 యేళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసీడీఎస్‌ ప్రాజెక్టు ఆఫీస్‌లో అందజేయాలి. దరఖాస్తులు వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవల్సి ఉంటుంది. పదో తరగతి మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.7,000ల నుంచి రూ.11,500ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages