UGC NET 2022: విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ్టితో ముగియనున్న యూజీసీ నెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday 23 January 2023

UGC NET 2022: విద్యార్థులకు అలర్ట్.. ఇవాళ్టితో ముగియనున్న యూజీసీ నెట్ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్..

Ugc Net

యూజీసీ నెట్ డిసెంబర్ 2022 పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మరో అవకాశం ఇచ్చింది. NTA UGC NET 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఇంకా నమోదు చేసుకోలేని అభ్యర్థులు NTA UGC అధికారిక వెబ్ సైట్  ద్వారా ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. NTA UGC NET డిసెంబర్ 2022 పరీక్ష కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తేదీని 23 జనవరి 2023 వరకు పొడిగించింది. అంతకుముందు, దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 17, 2023 వరకు ఉంది. అధికారిక నోటీసు ప్రకారం, జనవరి 21 నుంచి జనవరి 23, 2023 వరకు పొడిగించారు. దరఖాస్తు రుసుము తుది లావాదేవీకి చివరి తేదీ జనవరి 23, 2023గా నిర్ణయించారు. అంటే ఇవాళ్టితో(జనవరి 23) ముగియనుంది.

NTA నోటీసు జారీ చేసింది. దరఖాస్తు ఫారమ్‌లో నమోదు చేయబడిన సమాచారం సరైనదేనని గుర్తుంచుకోవాలని అభ్యర్థులకు సూచించింది. ఎందుకంటే పొడిగించిన వ్యవధిలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు దరఖాస్తు దిద్దుబాటుకు అవకాశం ఇవ్వబడదు. అంటే ఫారమ్ ఫిల్లింగ్ చేస్తున్న సమయంలోనే చాలా జాగ్రత్తగా నింపాల్సి ఉంటుంది.

UGC NET 2022 డిసెంబర్: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి..

  • ముందుగా UGC NET అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న UGC NET డిసెంబర్ 2022 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి, సమర్పించుపై క్లిక్ చేయండి.
  • దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి, రుసుము చెల్లించండి.
  • మీరు ఫారమ్‌ను పూరించిన తర్వాత, దాన్ని మళ్లీ చదివి, సమర్పించుపై క్లిక్ చేయండి.
  • నిర్ధారణ పేజీని డౌన్‌లోడ్ చేయండి
  • తదుపరి అవసరం కోసం హార్డ్ కాపీని దాచుకోండి.

మరిన్ని కెరీర్ అండ్ ఉద్యోగ వార్తల కోసం



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages