TSPSC Municipal Jobs: తెలంగాణలో మున్సిపల్ శాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,24,150ల జీతం.. | TSPSC Municipal Administration Recruitment 2022 for 78 Junior Officer, Junior Accounts and Senior Account Officer Posts. Check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 1 January 2023

TSPSC Municipal Jobs: తెలంగాణలో మున్సిపల్ శాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,24,150ల జీతం.. | TSPSC Municipal Administration Recruitment 2022 for 78 Junior Officer, Junior Accounts and Senior Account Officer Posts. Check details

తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్లు, అకౌంటెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల..

TSPSC Municipal Jobs: తెలంగాణలో మున్సిపల్ శాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.1,24,150ల జీతం..

TSPSC Municipal Administration Recruitment 2022

తెలంగాణ మున్సిపల్‌ శాఖలో 78 జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్లు, అకౌంటెంట్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్పీయస్సీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాం లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత పొంది ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జులై 1, 2022వ తేదీ నాటికి తప్పనిసరిగా 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జులై 2, 1978కి ముందు జులై 1, 2004 తర్వాత జన్మించి ఉండకూడదు.

ఈ అర్హతలున్న అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 11, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తు సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రూ.320లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. రాత పరీక్ష (పేపర్-1, పేపర్-2) ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. రాత పరీక్ష 2023 ఆగస్టు నెలలో నిర్వహిస్తారు. అర్హత సాధించిన వారికి నెలకు ఏవో పోస్టులకు రూ.45,960ల నుంచి రూ.1,24,150ల వరకు చెల్లిస్తారు. జేఏవో పోస్టులకు నెలకు రూ.42,300ల నుంచి రూ.1,15,270ల వరకు చెల్లిస్తారు. ఎస్‌ఏ పోస్టులకు నెలకు రూ.32,810ల నుంచి రూ.96,890ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు..

  • అకౌంట్స్ ఆఫీసర్(యూఎల్‌బీ) పోస్టులు:1
  • జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్(యూఎల్‌బీ) పోస్టులు: 13
  • సీనియర్ అకౌంటెంట్ (యూఎల్‌బీ) పోస్టులు: 64

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages