TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తుల గడువు పొడగిస్తూ నిర్ణయం. లాస్ట్ డేట్‌ ఎప్పుడంటే.. | TSPSC extending group 4 application to february 3rd date Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 31 January 2023

TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తుల గడువు పొడగిస్తూ నిర్ణయం. లాస్ట్ డేట్‌ ఎప్పుడంటే.. | TSPSC extending group 4 application to february 3rd date Telugu Education News

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1 పరీక్షలు పూర్తికాగా. గ్రూప్‌ 2,3,4లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతుండడం ఇదే తొలిసారి…

TSPSC: తెలంగాణ గ్రూప్‌ 4 అభ్యర్థులకు అలర్ట్‌.. దరఖాస్తుల గడువు పొడగిస్తూ నిర్ణయం. లాస్ట్ డేట్‌ ఎప్పుడంటే..

TSPSC Group 4 applications

ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే గ్రూప్‌ 1 పరీక్షలు పూర్తికాగా. గ్రూప్‌ 2,3,4లకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ జరుగుతుండడం ఇదే తొలిసారి కావడంతో అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూప్‌ 4 దరఖాస్తులను స్వీకరస్తోంది. ఇదిలా ఉంటే గ్రూప్‌-4 దరఖాస్తుల స్వీకరణకు సోమవారంతో గడువు ముగియాల్సి ఉంది.

అయితే ఈ ఒక్క రోజే ఏకంగా 34,247 దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ క్రమంలోనే టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. అభ్యర్థుల అభ్యర్థనలను పరిగణలోకి తీసుకున్న అధికారులు దరఖాస్తుల స్వీకరణ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 3వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. ఫిబ్రవరి 3వ తేదీలోపు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నోటిఫికేష్‌లో భాగంగా మొత్తం 9,168 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇప్పటి వరకు మొత్తం 8,47,277 మంది దరఖాస్తు చేసుకున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

తాజాగా దరఖాస్తుల స్వీకరణ గడువు పొడగించడంతో మరిన్ని దరఖాస్తులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే అభ్యర్థులు పెద్ద ఎత్తున దరఖాస్తులు చేసుకోవడంతో.. సర్వర్‌పై ఒత్తిడి అనూహ్యంగా పెరిగింది. దీంతో అప్లికేషన్‌ ఫామ్‌ ఫిల్‌ చేసిన తర్వాత చెల్లింపులో సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages