TS Police Events Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ఈవెంట్ల ఫలితాలు వెల్లడి..1,11,209 మంది ఎంపిక.. | Around 1,11,209 Candidates qualified in physical endurance tests for SI and Constable level Jobs in Telangana - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 6 January 2023

TS Police Events Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ఈవెంట్ల ఫలితాలు వెల్లడి..1,11,209 మంది ఎంపిక.. | Around 1,11,209 Candidates qualified in physical endurance tests for SI and Constable level Jobs in Telangana

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 06, 2023 | 9:27 PM

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి శారీరక దారుఢ్య పరీక్షలు (పీఎంటీ/పీఈటీ) జనవరి 5తో ముగిశాయి. మొత్తం 2,07,106 మంది అభ్యర్ధులు పీఎంటీ/పీఈటీ టెస్ట్‌లకు హాజరుకాగా, వీరిలో దాదాపు..

TS Police Events Results: తెలంగాణ ఎస్సై, కానిస్టేబుల్‌ ఈవెంట్ల ఫలితాలు వెల్లడి..1,11,209 మంది ఎంపిక..

TS Police Events

తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ స్థాయి శారీరక దారుఢ్య పరీక్షలు (పీఎంటీ/పీఈటీ) జనవరి 5తో ముగిశాయి. మొత్తం 2,07,106 మంది అభ్యర్ధులు పీఎంటీ/పీఈటీ టెస్ట్‌లకు హాజరుకాగా, వీరిలో దాదాపు 1,11,209 మంది అర్హత సాధించారు. అంటే దాదాపు 53.70 శాతం మంది అభ్యర్ధులు తదుపరి దశకు ఎంపికయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 12 కేంద్రాల్లో డిసెంబర్‌ 8న ప్రారంభమైన ఈ పరీక్షలు జనవరి 5వ తేదీ వరక నిర్వహించారు. వీరంతా మార్చి రెండో వారం నుంచి ఏప్రిల్‌ మూడో వారం వరకు జరిగే మెయిన్స్‌ రాతపరీక్షలకు హాజరవ్వనున్నారు. ఎంపికైన వారి వివరాలు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు శుక్రవారం (జనవరి 6) వెల్లడించింది.

554 ఎస్సై పోస్టులకు తుది రాత పరీక్షకు 52,786ల మంది పోటీ పడనున్నారు. 15,644 కానిస్టేబుల్ పోస్టులకు 90,488ల మంది పోటీ పడుతున్నారు. 614 ఆబ్కారీ కానిస్టేబుల్‌ పోస్టులకు 59,325 మంది పోటీ పడనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages