TS High Court Jobs 2023: నెలకు రూ.1,33,630ల జీతంతో తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. | Telangana High Court Recruitment 2023 for 20 Court Master Posts, Apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 15 January 2023

TS High Court Jobs 2023: నెలకు రూ.1,33,630ల జీతంతో తెలంగాణ హైకోర్టులో కోర్టు మాస్టర్‌ ఉద్యోగాలు.. ఈ అర్హతలుంటే చాలు.. | Telangana High Court Recruitment 2023 for 20 Court Master Posts, Apply online

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కోర్టు మాస్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 20 కోర్టు మాస్టర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, ఇంగ్లిష్‌ టైప్‌రైటింగ్‌ హయ్యర్‌గ్రేడ్‌ ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే దరఖాస్తుదారుల వయసు జనవరి 11, 2023 నాటికి 18 నుంచి 34 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, ఆదిమ తెగలు/బీసీ రిజర్వేషన్‌ వర్గాలకు వయోపరిమితిల సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 11, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభమవుతాయి. దరఖాస్తు సమయంలో ఓసీ/బీసీ కేటగిరీలకు చెందిన వారు రూ.600, ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్ధులు రూ.400లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించాలి. ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌ టెస్ట్‌/స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, రిజర్వేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.54,220ల నుంచి రూ.1,33,630ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages