TS 10th Model Question Papers 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | Telangana 10th Class Public Examination 2023 Model Question Papers Released - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 15 January 2023

TS 10th Model Question Papers 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. | Telangana 10th Class Public Examination 2023 Model Question Papers Released

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులకు అనుగుణంగా మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లను శుక్రవారం (జ‌న‌వ‌రి 13) విద్యాశాఖ విడుదల..

TS 10th Model Question Papers 2023: తెలంగాణ పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

TS 10th Model Question Papers

తెలంగాణ పదో తరగతి పబ్లిక్ పరీక్షల 2023 విధానంలో మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పదో తరగతి పరీక్షల విధానంలో మార్పులకు అనుగుణంగా మోడల్‌ క్వశ్చన్‌ పేపర్లను శుక్రవారం (జ‌న‌వ‌రి 13) విద్యాశాఖ విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు ఎస్‌సీఈఆర్‌టీ అధికారిక వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రశ్నపత్రాల్లో ఎస్సే ప్రశ్నల సెక్షన్‌లో ఇంటర్నల్ ఛాయిస్ తొలగించి.. ఛాయిస్‌ ప్రశ్నలను పెంచారు. మొత్తం ఆరు ప్రశ్నలు ఇస్తే.. వాటిల్లో ఏవైనా నాలుగింటికి సమాధానాలు రాస్తే సరిపోయేలా మార్పులు తీసుకొచ్చారు. ఆ ప్రకారం 80 మార్కుల మాదిరి ప్రశ్నపత్రాలను రూపొందించారు. సైన్స్‌లో భౌతిక, జీవశాస్త్రాలకు వేర్వేరుగా ప్రశ్నపత్రాలు ఇస్తున్నందున ఒక్కో దానికి 40 మార్కులు కేటాయించారు. రెండు పేపర్లు ఉండటంతో ఒక్కో పేపర్‌లో మూడు ప్రశ్నలిచ్చి రెండింటిక సమాధానాలు రాయాలని పేర్కొన్నారు.

ఇంటర్నల్‌ ఛాయిస్‌ విధానానికి స్వస్తి పలుకుతూ ఈ విధానాన్ని ప్రవేశ పెట్టారు. ఐతే ఈ విధానం తెలుగు, ఆంగ్లం, హిందీ వంటి ల్యాంగ్వేజ్‌ సబ్జెక్టులకు వర్తించదు. మిగిలిన సబ్జెక్టులైన గణితం, సైన్స్‌, సోషల్‌కు మాత్రమే మారిన విధానంలో క్వశ్చన్‌ పేపర్ ఇస్తారని విద్యాశాఖ ఇప్పటికే స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages