Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్.. జీతం ఎంతంటే | HCL to provide software jobs for over 20000 gov’t junior college students in Telangana Telugu News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 19 January 2023

Telangana: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇంటర్ పూర్తవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్.. జీతం ఎంతంటే | HCL to provide software jobs for over 20000 gov’t junior college students in Telangana Telugu News

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ఇంటర్ కంప్లీట్ అవ్వగానే సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే అవకాశం లభించబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

యువతకు ఉపాధి కల్పనలో భాగంగా తెలంగాణ సర్కార్ పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. ముఖ్యంగా ఐటీ మినిస్టర్ కేటీఆర్ ప్రోపర్ ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో చదువుకునే స్టూడెంట్స్ ఇంటర్ కంప్లీట్ చేయగానే.. సాఫ్ట్‌వేర్ జాబ్స్ తలుపు తట్టనున్నాయి. తెలంగాణ సర్కార్ దీనికి సంబంధించి.. HCL కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అయితే ఈ జాబ్ కావాలనుకునే స్టూడెంట్స్.. ఇంటర్‌లో ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ తీసుకోవాలి. కాగా సంవత్సరానికి ఇలా 20 వేల మందిని హైర్ చేయనుంది HCL.

గవర్నమెంట్ కాలేజీల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్‌‌కు ఏటా ఫిబ్రవరిలో HCL కెరీర్ యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతారు. ఈ పరీక్షలో మ్యాథ్స్‌తో పాటు ఆంగ్లం, లాజికల్ రీజనింగ్ ఉంటాయి. ఇందులో 60 పర్సెంట్ మార్క్స్ తెచ్చుకున్నవారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇది కూడా ఆన్‌లైన్ పద్దతిలోనే ఉంటుంది. ఇందులో మంచి టాలెంట్ చూపిస్తే.. జాబ్ ఇస్తారు. సెలక్ట్ అయినవారికి ఆన్‌లైన్‌లోనే 6 నెలలు ట్రైనింగ్ ఇస్తారు. అది కంప్లీట్ అయ్యాక HCL ఆఫీసులో మరో 6 నెలలు ఇంటర్న్‌షిప్ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ ఉన్నప్పుడు 10 వేలు స్టైఫండ్ ఇస్తారు. ఇది కూడా కంప్లీట్ అయ్యాక జాబ్‌లో జాయిన్ అవ్వాలి. ఉద్యోగం జాయిన్ అయినవారికి రూ. 2,50,000 వార్షిక వేతనం ఇస్తారు. అంటే నెలకు 20 వేలు చేతికి వస్తుంది.

ఇంకో సౌలభ్యం ఏంటంటే.. జాబ్ చేస్తూనే బిట్స్, ఎమిటీ వంటి యూనివర్శిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేయొచ్చు. ఎక్స్‌పీరియన్స్‌ని బట్టి.. శాలరీ పెరుగుతుంది. అయితే లాంగ్ రన్‌లో ఇది యువతకు మేలు చేస్తుందా అన్న అంశంపై మాత్రం భిన్న అభిప్రాయాలు ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages