Telangana: టీచర్లకు గుడ్ న్యూస్.. ఈ నెల 27 నుంచి బదిలీలు, ప్రమోషన్లు.. పాదర్శకంగా ప్రక్రియ.. | Transfers and promotions of teachers in Telangana from 27th of this month Telugu news - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 21 January 2023

Telangana: టీచర్లకు గుడ్ న్యూస్.. ఈ నెల 27 నుంచి బదిలీలు, ప్రమోషన్లు.. పాదర్శకంగా ప్రక్రియ.. | Transfers and promotions of teachers in Telangana from 27th of this month Telugu news

తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఈ నెల 27 నుంచి దీనికి సంభందించిన ప్రక్రియను ప్రారంభించాలని, మరియు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖ..

తెలంగాణలో టీచర్ల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమమైంది. ఈ నెల 27 నుంచి దీనికి సంభందించిన ప్రక్రియను ప్రారంభించాలని, మరియు పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఅర్ ఆదేశాలతో ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలకు సంభందించి శుక్రవారం సాయంత్రం బషీర్ బాగ్ లోని మంత్రి చాంబర్ లో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన, ఇతర అధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం అయ్యారు. పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సమగ్ర షెడ్యూల్ ను వెంటనే విడుదల చేయాలని మంత్రి ఆదేశించారు.కాసేపట్లో పూర్తి వివరాలతో కూడిన షెడ్యుల్ విడుదల చేయనున్నారు.

కాగా.. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకొవాలని సబితా ఇంద్రారెడ్డి అధికారులను కోరారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా సజావుగా పూర్తయ్యేలా అప్రమత్తంగా ఉండాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్ వేర్ లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూసుకోవాలి. దీనిని అధికారులు పర్యవేక్షించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షలుగా నియమించాలి. ప్రభుత్వం తీసుకున్న ఉపాధ్యాయ సానుకూల నిర్ణయం విజయవంతం అయి, పదోన్నతులు, బదిలీలు సాఫీగా జరగాలి.

           – సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ విద్యాశాఖ మంత్రి

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages