Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణాలో వాటర్‌ హీటర్ల ఉత్పత్తి ప్లాంట్‌.. రూ.210 కోట్ల పెట్టుబడి | Hintastica Private Limited (HPL) Begins Production of Water Heaters in Telangana with an Initial Investment of INR 210 Crore - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 12 January 2023

Telangana: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. తెలంగాణాలో వాటర్‌ హీటర్ల ఉత్పత్తి ప్లాంట్‌.. రూ.210 కోట్ల పెట్టుబడి | Hintastica Private Limited (HPL) Begins Production of Water Heaters in Telangana with an Initial Investment of INR 210 Crore

తెలంగాణలో కొత్త కొత్త కంపెనీలు విస్తరిస్తున్నాయి. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కంపెనీలు స్థాపించేందుకు పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. ఇక తాజాగా..

తెలంగాణలో కొత్త కొత్త కంపెనీలు విస్తరిస్తున్నాయి. అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో కంపెనీలు స్థాపించేందుకు పెట్టుబడులతో ముందుకు వస్తున్నారు. కొత్త కంపెనీల ఏర్పాటుతో నిరుద్యోగులకు కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. టెక్నాలజీ పరంగా దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంలో సంస్థలను స్థాపించేందుకు ఇన్వెస్టర్లు ముందుకొస్తున్నారు. ఇక తాజాగా హింటాస్టికా ప్రైవేట్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీఎల్‌) హీటింగ్‌ అప్లయెన్సస్‌ను తెలంగాణాలోని జడ్చర్లలో అత్యాధునిక ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు హెచ్‌పీఎల్‌ తెలిపింది. దాదాపు 5.7 ఎకరాల విస్తీర్ణంలో 210 కోట్ల రూపాయల తొలి పెట్టుబడితో నిర్మించిన ఈ కేంద్రంలో సంవత్సరానికి ఆరు లక్షల యూనిట్ల వాటర్‌ హీటర్లు, హీటింగ్‌ అప్లయెన్సస్‌ను తయారుచేసే సామర్ధ్యం ఉంది. ఈ సంస్ధ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఈ ప్లాంట్‌ను అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేశారు.

ఈ ప్లాంట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సందీప్‌ సోమానీ, గ్రూప్‌ అట్లాంటిక్‌ సీఈఓ పియర్రీ లూయిస్‌ ఫ్రాన్కోయిస్‌, భారత్‌లో ఫ్రాన్స్‌ రాయబార కార్యాలయం ట్రేడ్‌ కమిషనర్‌ ఎరిక్‌ ఫాజోల్‌ పాల్గొన్నారు.

ఈ ప్లాంట్‌లో తయారైన ఉత్పత్తులు ఇతర దేశాలకు..

ఈ ప్లాంట్‌ ద్వారా సార్క్‌లో భాగమైన చుట్టు పక్కల దేశాలకు తమ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుంది. ఇందులో బంగ్లాదేశ్‌, భూటాన్‌, నేపాల్‌, శ్రీలంక దేశాలున్నాయి. ఈ ప్లాంట్‌ వద్ద ఉత్పత్తిస్కేర్‌ నమూనా, సిలిండ్రికల్‌ స్టోరేజీ వాటర్‌ హీటర్‌మోడల్స్‌ అల్వియో, ఎర్జో నియా అందిస్తుంది. మొట్టమొదటి పోర్బబల్‌ వాటర్‌ హీటర్‌, హింద్‌వేర్‌ అట్లాంటిక్‌ల క్వీక్‌ సైతం ఈ ప్లాంట్‌లో తయారు చేయనున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

భారతదేశంలో వాటర్‌ హీటర్‌ల మార్కెట్‌ సుమారు 2300 కోట్ల రూపాయలు. ఇది 2032 నాటికి 6100 కోట్ల రూపాయలు కావొచ్చని అంచనా కంపెనీ అంచనా. భారతదేశంలో వ్యక్తిగత విద్యుత్‌ వాటర్‌ హీటర్లకు డిమాండ్‌ పెరుగుతుంది. దీనికి తోడు వేగవంతమైన నగరీకరణ, విద్యుత్‌ విస్తృత స్థాయిలో లభిస్తుండటం, పెరిగిన డిస్పోజబల్‌ ఇన్‌కమ్‌ కూడా దీనికి కారణం. అదనంగా, భారతదేశంలో అత్యంత కీలకమైన మెట్రో నగరాలలో ప్రీమియం హోమ్‌ అప్లయెన్సస్‌ ఉత్పత్తులకు సైతం గణనీయంగా డిమాండ్‌ పెరిగింది. ఇప్పుడు ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేయడం వల్ల కంపెనీ తమ లక్ష్య సాకార దిశగా మరోఅడుగు ముందుకేస్తుంది. దానితో పాటుగా వాటర్‌ హీటర్‌ విభాగంలో మరింతగా మార్కెట్‌ పొంది రాబోయే ఐదేళ్లలో అగ్రశ్రేణి మూడు కంపెనీలలో ఒకటిగా నిలువనున్నట్లు కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

ఈ సందర్భంగా హింద్‌వేర్‌ హోమ్‌ ఇన్నోవేషన్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ సందీప్‌ సోమానీ మాట్లాడుతూ.. గ్రూప్‌ అట్లాంటిక్‌తో మా ఉమ్మడి సంస్ధలో అత్యంత కీలకమైన అంశం ఇది. కొవిడ్‌ మహమ్మారి కారణంగా సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఉత్పత్తిని ఇప్పుడు ప్రారంభిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. మా నూతన తయారీ కేంద్రం ప్రారంభించడం ద్వారా మా మార్కెట్‌ వాటాను గణనీయంగా వృద్ధి చేయగలమని భావిస్తున్నాము. వాటర్‌ హీటర్‌ విభాగంలో మా స్థానాన్ని మరింతగా బలోపేతం చేయనున్నాము అని అన్నారు.

అలాగే గ్రూప్‌ అట్లాంటిక్‌ సీఈఓ పియార్రీ లూయిస్‌ ఫ్రాంకోయిస్‌ మాట్లాడుతూ.. పది సంవత్సరాల క్రితం హింద్‌వేర్‌తో మా అనుబంధం ప్రారంభమైంది. నేడు ఆ భాగస్వామ్యంను మరోస్ధాయికి తీసుకువెళ్తుండటం పట్ల సంతోషంగా ఉన్నాము. ఈ భాగస్వామ్యంతోనే ఈ ఇంటిగ్రేటెడ్‌ వాటర్‌ హీటర్‌ కంపెనీ ప్రారంభించామని అన్నారు. రెండు గ్రూప్‌లూ ఒకే తరహా పారిశ్రామిక, ఫ్యామిలీ విలువలు పంచుకుంటుంటాయి. భారతదేశంలో మా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇంతటి మహోన్నత దేశమైన ఇండియాలో విజయం సాధించాలంటే మాకు బలమైన స్ధానిక భాగస్వామి కావాలని మాకు తెలుసు. అలాగే భారతదేశంలో తయారీ కార్యక్రమాలకు అది తప్పనిసరి అని సందీప్‌ సోమానీ పేర్కొన్నారు.

విడిభాగాల సాంకేతికతల పట్ల అవగాహన:

విడిభాగాల సాంకేతికతల పట్ల పూర్తి అవగాహన పొందడానికి ఈ ప్లాంట్ ఎంతగానో ఉపయోగపడనుందని భావిస్తున్నామని అన్నారు. ఈ కారణం చేతనే మేము భారతదేశానికి మా విజ్ఞానాన్ని శక్తి నిర్వహణ, ఉష్ణోగ్రత నియంత్రణ పరంగా తీసుకువస్తున్నాము. ఇది మా భారతీయ డెవలప్‌మెంట్‌కు అతిపెద్ద ఆస్తిగా నిలుస్తుందని, అతి తక్కువ కార్బన్‌ ధర్మల్‌ ఉత్పత్తులతో శక్తి వినియోగాన్ని తగ్గించడంలో దోహదపడుతుందని మేము నమ్ముతున్నామని ఆయన అన్నారు.

పర్యావరణకు అనుకూలంగానే ప్లాంట్‌ ఏర్పాటు:

కాగా, ఈ ప్లాంట్‌ను పర్యావరణ అనుకూలత, ఇంధన సామర్ధ్యం అనే అంశాలను పరిగణలోకి తీసుకుని అభివృద్ధి చేశామని అన్నారు. ఈ భవంతి ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ కోసం అర్హత సాధించింది. ఈ ప్లాంట్‌కు సోలార్‌ప్యానెల్స్‌ అమర్చడం జరిగింది. వీటి వార్షిక విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం1 మెగా వాట్‌. ఇదే కాదు, ప్లాంట్‌లోని కృత్రిమ కాంతి అంతా కూడా ఓ ప్రత్యేక వ్యవస్ధను కలిగి ఉంది. ఇది ప్రత్యేకంగా ఎల్‌ఈడీ దీపాలను వినియోగిస్తుంది. ఈ ప్లాంట్‌లో రెయిన్‌వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌ కూడా ఉంది. ఇది 90% వర్షపు నీటిని ప్లాంట్‌లో తిరిగి వినియోగించుకునే విధంగా ప్లాంట్‌ను ఏర్పాటు చేశామన్నారు. హార్వెస్టెడ్‌ రెయిన్‌ వాటర్‌, గ్రీన్‌బెల్ట్స్‌, సోలార్‌ పవర్‌ వినియోగంతో ఈ ప్లాంట్‌ తమ కార్యకలాపాలలో పునరుత్పాదక శక్తిని వినియోగిస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చదవండి

ఇవి కూడా చదవండి

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages