SI Constable Exams: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్‌.. రాత పరీక్షల తేదీల్లో మార్పులు.. కొత్త డేట్స్ ఇవే | TSLPRB Has Changed The Dates Of Police Recruitment Final Examinations, Check New Dates Here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, 13 January 2023

SI Constable Exams: ఎస్‌ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలెర్ట్‌.. రాత పరీక్షల తేదీల్లో మార్పులు.. కొత్త డేట్స్ ఇవే | TSLPRB Has Changed The Dates Of Police Recruitment Final Examinations, Check New Dates Here

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరవుతోన్న అభ్యర్థులకు అలెర్ట్‌. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్ పరీక్షల తేదీలకు సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామాక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ).

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు ప్రిపేరవుతోన్న అభ్యర్థులకు అలెర్ట్‌. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ మెయిన్స్ పరీక్షల తేదీలకు సంబంధించి కీలక అప్డేట్‌ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామాక బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ). దీని ప్రకారం తుది రాత పరీక్షల (మెయిన్స్‌) తేదీల్లో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. ఎస్‌ఐ (ఐటీ), ఏఎస్సై (ఫింగర్ ఫ్రింట్స్), కానిస్టేబుల్, కానిస్టేబుల్ (ఐటీ) పరీక్షల తేదీల్లో మార్పులు జరిగినట్లు పోలీస్‌ రిక్రూట్ మెంట్ బోర్డు వెల్లడించింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన కానిస్టేబుల్ రాత పరీక్షను 30న, కానిస్టేబుల్ (ఐటీ విభాగం) పరీక్ష ఏప్రిల్ 23వ తేదీ నుంచి 30వ తేదీకి, ఎస్సై(ఐటీ) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి, ఏఎస్సై( ఫింగర్ ప్రింట్స్) పరీక్ష మార్చి 12వ తేదీ నుంచి 11వ తేదీకి మార్పు చేసినట్లు టీఎస్‌పీఎల్‌ఆర్‌బీ వెల్లడించింది. ఈ పరీక్షల సమయంలో ఇతర పరీక్షలు కూడా ఉన్నాయని తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) చేసిన విజ్ఞప్తి మేరకే పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి గతేడాది ఆగస్టు 7న ప్రాథమిక పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో క్వాలిఫై అయిన వారికి..గత నెలలో ఈవెంట్స్ పరీక్షలను నిర్వహించింది. డిసెంబర్ 8న మొదలైన ఎస్సై, కానిస్టేబుల్ ఫిజికల్ ఈవెంట్స్ ప్రక్రియ జనవరి 5వ తేదీన ముగిశాయి.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 12 సెంటర్లలో ఈవెంట్స్ నిర్వహించగా.. 2,07,106 మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. ఇందులో 53.7 శాతం మంది అభ్యర్థులు తుది పరీక్షకు అర్హత సాధించారని పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ వెల్లడించింది. వీరందరికి తుది పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. అయితే పరీక్షల తేదీలను మారుస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ. కాగా నోటిఫికేషన్‌ ప్రకారం 16,969 కానిస్టేబుల్‌ పోస్టుల కోసం ప్రస్తుతం తుది రాతపరీక్షకు 1,75,657 మంది అర్హత సాధించారు. అంటే ఒక్కో పోస్టుకు 11 మంది వరకు పోటీలో ఉన్నట్లు లెక్క. అలాగే 587 ఎస్‌ఐ పోస్టుల కోసం 59,574 మంది బరిలో మిగిలారు. అంటే ఒక్కో కొలువుకు 101 మంది వరకు పోటీలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages