Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.. | Reliance foundation offering scholarships for under graduate and post graduate students Telugu Education News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 29 January 2023

Scholarship: విద్యార్థులకు గుడ్ న్యూస్‌.. రూ. 6 లక్షల స్కాలర్‌షిప్‌ పొందే అవకాశం. ఎలా అప్లై చేసుకోవాలంటే.. | Reliance foundation offering scholarships for under graduate and post graduate students Telugu Education News

భారత దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ రిలయన్స్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్‌లకు..

భారత దేశానికి చెందిన ప్రతిష్టాత్మక సంస్థ రిలయన్స్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్స్‌ అందిస్తోంది. రిలయన్స్ సంస్థ ఆధ్వర్యంలోని రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ అండర్‌ గ్రాడ్యుయేట్‌, పోస్ట్ గ్రాడ్యుయేషన్‌ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇంతకీ ఈ స్కాలర్‌ షిప్‌లు పొందడానికి ఎవరు అర్హులు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

మొత్తం 5100 స్కాలర్‌షిప్‌లను అందిస్తున్నారు. వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌షిప్‌లు (5000), పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌లు (100) ఉన్నాయి. అండర్ గ్రాడ్యుయేషన్ స్కాలర్‌షిప్‌లు పొందడానికి విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి 12వ తరగతిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఫుల్ టైమ్ అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారై ఉండాలి. ఎంపికై వారికి రూ. 2 లక్షలు స్కాలర్‌ షిప్‌ను అందిస్తారు. అభ్యర్థులను ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో మెరిట్ ఆదారంగా ఎంపిక చేస్తారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్కాలర్‌ షిప్‌ విషయానికొస్తే దీనికి దరఖాస్తు చేసుకునే విద్యార్థులు గుర్తింపు పొందిన సంస్థ నుంచి కనీసం 7.5 పాయింట్లతో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేదా గేట్ పరీక్షలో 550 నుంచి 1000 పాయింట్లు సాధించి పీజీలో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు. ఎంపికైన విద్యార్థులకు రూ. 3 లక్షలు స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. విద్యార్థులను ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షలో సాధించిన మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి. దరఖాస్తుల స్వీకరణకు ఫిబ్రవరి 14, 2023ని చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages