PM MODI: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. మీరూ మోదీని ఏదైనా అడగాలనుకుంటున్నారా.? ఇలా చేయండి.. | PM Modi’s Pariksha Pe Charcha to be held on 27th January in New Delhi, Students may send their questions with best question to be featured in main event - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 18 January 2023

PM MODI: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. మీరూ మోదీని ఏదైనా అడగాలనుకుంటున్నారా.? ఇలా చేయండి.. | PM Modi’s Pariksha Pe Charcha to be held on 27th January in New Delhi, Students may send their questions with best question to be featured in main event

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి ఎదురవడం సర్వ సాధారణమైన విషయం. ఈ ఒత్తిడిని జయించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఏటా.. ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులకు పలు చిట్కాలు, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే..

PM MODI: ఈ నెల 27న ప్రధాని పరీక్షా పే చర్చ.. మీరూ మోదీని ఏదైనా అడగాలనుకుంటున్నారా.? ఇలా చేయండి..

Pm Modi Pariksha Pe Charcha

పరీక్షల సమయంలో విద్యార్థులకు ఒత్తిడి ఎదురవడం సర్వ సాధారణమైన విషయం. ఈ ఒత్తిడిని జయించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతీ ఏటా.. ‘పరీక్షా పే చర్చ‘ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రధాని విద్యార్థులకు పలు చిట్కాలు, ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలనే మెలుకువల గురించి వివరిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జనవరి 27వ తేదీ ప్రధాని విద్యార్థులతో ముచ్చటించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీలోని తల్కటరా స్టేడియంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థులు 9 నుంచి 12వ తరగతి చదువుతున్న వారై ఉండాలి. కేవలం విద్యార్థులే కాకుండా పేరెంట్స్‌, ఉపాధ్యాయులు కూడా పాల్గొనే అవకాశం కల్పించారు. పరీక్షా పే కార్యక్రమంలో పాల్గొనలానుకునే వారు నవంబర్‌ 25 నుంచి డిసెంబర్‌ 30 వ తేదీ వరకు అవకాశం కల్పించారు. సుమారు రెండు వేలకుపైగా మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఎన్సీఆర్టీఏ తరఫున సర్టిఫికేట్‌తో పాటు ఎగ్జామ్స్‌ వారియర్స్‌ అనే పుస్తకాన్ని అందిస్తారు.

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో మీరూ వర్చువల్‌ పాల్గొనే అవకాశం కల్పించారు. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానిని అడిగే వీలు కల్పించారు. ఇందుకోసం విద్యార్థులు తమ సందేహాన్ని వీడియోగా తీసి మెయిల్‌ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు తమ సందేహాలను ప్రధానమంత్రిని అడుగుదామని అనుకుంటే HD క్వాలిటీ వీడియోని pibhyderabad@gmail.com మెయిల్ ఐడికీ పంపించాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages