Job crisis in AP: నిరుద్యోగ పర్వం.. ఇంటర్ అర్హత కలిగిన కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ పట్టభద్రుల నుంచి దరఖాస్తులు | Job crisis in Andhra Pradesh: LLB, MTech, MBA, MSc, PhD Graduates applied for Police Constable jobs - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 14 January 2023

Job crisis in AP: నిరుద్యోగ పర్వం.. ఇంటర్ అర్హత కలిగిన కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు పీహెచ్‌డీ పట్టభద్రుల నుంచి దరఖాస్తులు | Job crisis in Andhra Pradesh: LLB, MTech, MBA, MSc, PhD Graduates applied for Police Constable jobs

ఇంటర్‌ అర్హత కలిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్సీ వంటి ఉన్నత విద్యాకోర్సులు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 6100 పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే హాల్‌ టికెట్లు కూడా విడుదలయ్యాయి. ఈ క్రమంలో ఇంటర్‌ అర్హత కలిగిన కానిస్టేబుల్ ఉద్యోగాలకు పీహెచ్‌డీ, ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్‌, ఎంబీఏ, ఎంఎస్సీ వంటి ఉన్నత విద్యాకోర్సులు చదివిన వారు కూడా దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఇది అద్దం పడుతోంది. మొత్తం 5,03,486 మంది దరఖాస్తు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,95,415 మంది పురుషులు, 1,08,071 మంది మహిళలు ఉన్నారు. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు సగటున 83 మంది పోటీ పడుతున్నారు. 2018 తర్వాత దాదాపు నాలుగేళ్లకి పోలీస్‌ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రకటన వెలువడింది. మళ్లీ ఎన్నాళ్లకు జాబ్‌ నోటిఫికేషన్లు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో తీవ్ర పోటీ నెలకొంది.

ఇవి కూడా చదవండి

డిగ్రీల వారీగా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి వివరాలు ఇలా..

  • వీరిలో పీహెడ్‌డీ ఉత్తీర్ణత సాధించిన వారు 10 మంది
  • ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసిన వారు 94 మంది
  • ఎంటెక్‌ పూర్తి చేసిన వారు 930 మంది
  • ఎంకాం పూర్తి చేసిన వారు 1527 మంది
  • ఎంబీఏ పూర్తి చేసిన వారు 5,284 మంది
  • ఎమ్మెస్సీ పూర్తి చేసిన వారు 4,365 మంది
  • ఎంఏ పూర్తి చేసిన వారు 1845 మంది
  • బీసీఏ పూర్తి చేసిన వారు 757 మంది
  • ఇంటర్‌ పూర్తి చేసిన వారు 2,97,655 మంది
  • బీఎస్సీ పూర్తి చేసిన వారు 61,419 మంది
  • బీటెక్‌ పూర్తి చేసిన వారు 31,695 మంది
  • బీఏ పూర్తి చేసిన వారు 21,024 మంది
  • డిప్లొమా పూర్తి చేసిన వారు 15,254 మంది
  • ఇతర డిగ్రీలు చేసిన వారు 4,134 మంది

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages