IIT Hyderabad Jobs 2023: బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ ఐఐటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | IIT Hyderabad Recruitment 2022 for Library System Trainee, Junior Research Fellow Posts. apply online - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday 17 January 2023

IIT Hyderabad Jobs 2023: బీటెక్‌ అర్హతతో హైదరాబాద్‌ ఐఐటీలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | IIT Hyderabad Recruitment 2022 for Library System Trainee, Junior Research Fellow Posts. apply online

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన లైబ్రరీ సిస్టమ్ ట్రైనీ, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ..

హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ.. తాత్కాలిక ప్రాతిపదికన లైబ్రరీ సిస్టమ్ ట్రైనీ, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ, బీటెక్‌ (సీఎస్‌/ ఐటీ), ఎంసీఏ, ఎంఎస్సీ(కెమిస్ట్రీ) లేదా తత్సమాన కోర్సులో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సీఎస్‌ఐఆర్‌/యూజీసీ జేఆర్‌ఎఫ్‌- నెట్‌/గేట్‌లో అర్హత సాధించి ఉండాలి. దరఖాస్తుదారుల వయసు పోస్టును బట్టి 26, 27 యేళ్లు ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 6, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులకు జనవరి 19వ తేదీ లోపు tpanda@chy.iith.ac.inకు ఈ మెయిల్‌ చేయవల్సి ఉంటుంది. జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలో పోస్టులకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. లైబ్రరీ సిస్టమ్ ట్రైనీ పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages