HAL Jobs: రాత పరీక్షలేకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | HAL Odisha Recruitment 2023 for 34 Junior Lecturer, Laboratory Assistant and Other Posts. Check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 8 January 2023

HAL Jobs: రాత పరీక్షలేకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | HAL Odisha Recruitment 2023 for 34 Junior Lecturer, Laboratory Assistant and Other Posts. Check details

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఒడిశాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. 34 జూనియర్‌ లెక్చరర్లు, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎల్‌డీసీ, టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్ తదితర పోస్టుల భర్తీకి..

HAL Jobs: రాత పరీక్షలేకుండా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

Hindustan Aeronautics Ltd

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఒడిశాలోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్.. 34 జూనియర్‌ లెక్చరర్లు, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఎల్‌డీసీ, టీజీటీ, పీజీటీ, ప్రైమరీ టీచర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. బోటనీ, కామర్స్‌, హిందీ, జువాలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ తదితర విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీ/బీఈడీ/గ్రాడ్యుయేషన్‌/మాస్టర్స్‌ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో కనీసం 4 ఏళ్ల అనుభవం కూడా ఉండాలి. అలాగే అభ్యర్ధుల వయసు 21 నుంచి 50 యేళ్ల మధ్య ఉండాలి.ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్‌ విడుదలైన 15 రోజుల్లోపు (జనవరి 20, 2023) ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. షార్ట్‌లిస్టింగ్‌/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.10,200ల నుంచి రూ.19,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ చూడొచ్చు.

అడ్రస్‌..

The Principal, Aeronautic college, Hindustan Aeronautics Limited township, sunbeda, koraput, Odisha – 763002.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages