Chocolate side effects: గర్భిణీలు చాక్లెట్లు తింటున్నారా.? పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్య రావొచ్చు జాగ్రత్త.. | These are the side effects with chocolate for pregnant women Telugu Health News - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday 29 January 2023

Chocolate side effects: గర్భిణీలు చాక్లెట్లు తింటున్నారా.? పుట్టబోయే పిల్లల్లో ఈ సమస్య రావొచ్చు జాగ్రత్త.. | These are the side effects with chocolate for pregnant women Telugu Health News

అందరూ ఇష్టపడి తినే ఆహార పదార్థాల్లో చాక్లెట్లు ప్రధానమైనవి. చాక్లెట్స్‌ రుచి అలాంటిది మరి. ఇక చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా మనలో చాలా మంది నమ్ముతుంటారు. అయితే చాక్లెట్స్‌ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయనేదాంట్లో..

అందరూ ఇష్టపడి తినే ఆహార పదార్థాల్లో చాక్లెట్లు ప్రధానమైనవి. చాక్లెట్స్‌ రుచి అలాంటిది మరి. ఇక చాక్లెట్లు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా మనలో చాలా మంది నమ్ముతుంటారు. అయితే చాక్లెట్స్‌ తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నాయనేదాంట్లో నిజమే ఉంది. ముఖ్యంగా మహిళలకు నెలసరి సమయంలో నొప్పి తగ్గడంలో డార్క్‌ చాక్లెట్లు ఉపయోగపడతాయని చెబుతుంటారు. అయితే చాక్లెట్లు తీసుకోవడం వల్ల లాభాలు ఉన్నట్లే నష్టాలు కూడా ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డార్క్‌ చాక్లెట్‌లు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి.? ఎలాంటి వారు వీటికి దూరంగా ఉండాలి.? లాంటి వివరాలపై ఓ లుక్కేయండి..

డార్క్‌ చాక్లెట్స్‌లో యాంటీఆక్సిడెంట్స్‌, చక్కర తక్కువగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతుంటారు. అయితే వీటివల్ల గర్భిణీలకు ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల డార్క్‌ చాక్లెట్స్‌లో సీసం, కాడ్మియం వంటివి ఉంటాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. మరీ ముఖ్యంగా గర్భిణీలు, చిన్న పిల్లల్లో ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. సీసం శరీర అభివృద్ధితో పాటు మెదడుపై ప్రభావం చూపుతుంది. వీటి కారణంగా తక్కువ ఐక్యూ ఉన్న పిల్లలు పుట్టే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

ఇక వయసు మళ్లిన వారిలో కూడా చాక్లెట్లు అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీరు సీసం ఎక్కువగా ఉండే చాక్లెట్లను తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ సమస్యలు, అధిక రక్తపోటు, రోగనిరోధక వ్యవస్థ తగ్గుతుంది. మూత్రపిండాలు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. అయితే తక్కువ సీసం లేదా కాడ్మియం ఉన్న డార్క్ చాక్లెట్, కోకో కంటెంట్ తక్కువగా ఉండే డార్క్ చాక్లెట్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

నోట్‌: పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు అందించినవి మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్య నిపుణుల సూచనలు తీసుకోవడమే సూచించదగ్గ అంశం.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం క్లిక్ చేయండి..



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages