BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే.. | Bob recruitment 2023 bank of baroda invites applications for senior manager posts au57 - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday 7 January 2023

BOB Recruitment: బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో సీనియర్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అర్హులు ఎవరంటే.. | Bob recruitment 2023 bank of baroda invites applications for senior manager posts au57

బ్యాంక్‌ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెగ్యులర్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబయిలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?

బ్యాంక్‌ ఆఫ్ బరోడా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. రెగ్యులర్‌ విధానంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ముంబయిలో ఉద్యోగాల భర్తీకి ఈ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 15 ఖాళీనలు భర్తీ చేయనున్నారు.

* వీటిలో సీనియర్ మేనేజర్- లార్జ్ కార్పొరేట్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ (1), సీనియర్ మేనేజర్- బ్యాంక్, ఎన్‌బీఎఫ్‌సీ అండ్‌ ఎఫ్‌ఎల్‌ సెక్టార్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ ( 2), సీనియర్ మేనేజర్- క్లైమేట్ రిస్క్ & సస్టైనబిలిటీ (2), సీనియర్ మేనేజర్- ఎంఎస్‌ఎంఈ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ (2), సీనియర్ మేనేజర్- రిటైల్ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ (1), సీనియర్ మేనేజర్- రూరల్‌ & అగ్రికల్చర్‌ లోన్స్‌ క్రెడిట్ రిస్క్ మేనేజ్‌మెంట్ (1), సీనియర్ మేనేజర్- ఎంటర్‌ప్రైజ్ అండ్‌ ఆపరేషనల్ రిస్క్ మేనేజ్‌మెంట్ (3), సీనియర్ మేనేజర్- పోర్ట్‌ఫోలియో మానిటరింగ్ & క్వాలిటీ కంట్రోల్ (1), సీనియర్ మేనేజర్- ఫ్రాడ్ ఇన్సిడెంట్స్‌ అండ్‌ రూట్‌ కాజ్‌ అనాలిసిస్‌ (2) ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీంతో పాటు పని అనుభవం ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులు ముంబయిలో పనిచేయాల్సి ఉంటుంది.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణకు 24-01-2023ని చివరి తేదీగా నిర్ణయించారు.

* నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి..

* పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి..

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండిNo comments:

Post a Comment

Post Bottom Ad

Pages