APPSC Group 1 Result date: ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌.. 111కు పెరిగిన పోస్టుల సంఖ్య | APPSC Group 1 Prelims ended peacefully; Check here Prelims result date - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 9 January 2023

APPSC Group 1 Result date: ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌.. 111కు పెరిగిన పోస్టుల సంఖ్య | APPSC Group 1 Prelims ended peacefully; Check here Prelims result date

Srilakshmi C

Srilakshmi C |

Updated on: Jan 08, 2023 | 9:15 PM

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 8న ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు..

APPSC Group 1 Result date: ప్రశాంతంగా ముగిసిన ఏపీపీఎస్సీ గ్రూపు-1 ప్రిలిమ్స్‌.. 111కు పెరిగిన పోస్టుల సంఖ్య

APPSC Group 1 Prelims

ఆంధ్రప్రదేశ్‌ గ్రూపు-1 ప్రిలిమినరీ రాత పరీక్ష జనవరి 8న ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 18 జిల్లాల్లో 297 పరీక్ష కేంద్రాల్లో 1,26,499 మంది అభ్యర్థులు గ్రూప్‌ 1 ప్రిలిమ్స్‌ పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ ‘కీ’ ఏపీపీఎస్సీ త్వరలోనే విడుదల చేయనుంది. కాగా మొత్తం 92 పోస్టులకు కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసినప్పటికీ జనవరి 6న అదనంగా మరో 19 పోస్టులను కలుపుతున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 111కు చేరింది.

2018 గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ అనుసరించి నియమించిన వారిలో కొందరు విధుల్లో చేరనందున మిగిలిన 17 పోస్టులు, భర్తీకాని మరో రెండు పోస్టులను ప్రస్తుత నోటిఫికేషన్‌ పోస్టులకు కలిపినట్లు కమిషన్‌ వెల్లడించింది. కేవలం మూడు వారాల్లోనే ఫలితాలు కూడా విడుదలవనున్నాయి. ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు ప్రకటించిన 90 రోజుల వ్యవధిలోనే మెయిన్స్‌కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages