AP High Court jobs: నెలకు రూ.1,47,760ల జీతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా.. | AP High Court Recruitment 2023 for 39 Court master and Personal Secretary Posts, check details - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday 5 January 2023

AP High Court jobs: నెలకు రూ.1,47,760ల జీతంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు ఉద్యోగాలు.. దరఖాస్తు ఇలా.. | AP High Court Recruitment 2023 for 39 Court master and Personal Secretary Posts, check details

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టులో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం హైకోర్టులో.. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన 39 కోర్ట్ మాస్టర్, పర్సనల్ సెక్రటరీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆర్ట్స్/సైన్స్/కామర్స్ విభాగంలో డిగ్రీ, ఇంగ్లిష్‌ షార్ట్‌హ్యాండ్‌, హయ్యర్ గ్రేడ్ ఇంగ్లిష్ టైప్ రైటింగ్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. దరఖాస్తుదారుల వయసు జనవరి 1, 2023వ తేదీ నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 25, 2023వలోపు కింది అడ్రస్‌కు దరఖాస్తులు పంపించవల్సి ఉంటుంది. జనరల్ అభ్యర్ధులు రూ.1000లు, ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులు రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ రాత పరీక్ష, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. రాత పరీక్ష ఫిబ్రవరి 4, 2023న నిర్వహిస్తారు. ఫలితాలు అదేనెల 8న విడుదలవుతాయి. ఎంపికైన వారికి నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.

అడ్రస్‌..

The Registrar (Administration), High Court of Andhra Pradesh, Nelapadu, Amaravati, Guntur District, AP.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages