AP Govt Jobs 2023: రాత పరీక్ష లేకుండా విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | APCOS Visakhapatnam Recruitment 2023 for 7 Data Entry Operator Posts. Check full details here - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 12 January 2023

AP Govt Jobs 2023: రాత పరీక్ష లేకుండా విశాఖపట్నం జిల్లాలో ఉద్యోగాలు.. ఇలా దరఖాస్తు చేసుకోండి.. | APCOS Visakhapatnam Recruitment 2023 for 7 Data Entry Operator Posts. Check full details here

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లోని జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన.. డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌లోని జిల్లా రెవెన్యూ శాఖ, ఎన్నికల విభాగంలో అవుట్ సోర్సింగ్‌ ప్రాతిపదికన.. 7 డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్‌ ఎంఎస్‌ ఆఫీస్‌లో డిప్లొమా/పీజీ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. దరఖాస్తుదారుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

ఈ అర్హతలున్నవారు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు ఫాంను డౌన్‌లోడ్‌ చేసకుని ఆఫ్‌లైన్‌ విధానంలో జనవరి 19, 2023వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కింది అడ్రస్‌లో ప్రత్యేకంగా ఉంచిన బాక్సులో వేస్తే సరిపోతుంది. షార్ట్‌లిస్ట్‌ చేసిన వారిని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ప్రతిభకనబరచిన వారికి నెలకు రూ.18,5000ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

అడ్రస్..

జిల్లా కలెక్టర్‌ మరియు ఎక్స్‌ అఫిసియో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌, APCOS – జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ, విశాఖపట్నం జిల్లా.

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages