UPSC IAS Mains Result 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్స్‌)-2022 ఫలితాలు విడుదల..ఇక్కడ డైరెక్ట్‌గా చెక్‌ చేసుకోండి.. | UPSC Civil Services Mains Result 2022 declared, Check Here Directly - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 6 December 2022

UPSC IAS Mains Result 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్స్‌)-2022 ఫలితాలు విడుదల..ఇక్కడ డైరెక్ట్‌గా చెక్‌ చేసుకోండి.. | UPSC Civil Services Mains Result 2022 declared, Check Here Directly

యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్) సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఫలితాలు మంగళవారం (డిసెంబర్‌ 6)న విడుదలయ్యాయి. మెయిన్స్‌ రాత పరీక్షకు హాజరైనవారు అధికారిక వెబ్‌సైట్‌..

UPSC IAS Mains Result 2022: యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ (మెయిన్స్‌)-2022 ఫలితాలు విడుదల..ఇక్కడ డైరెక్ట్‌గా చెక్‌ చేసుకోండి..

UPSC Civil Services Mains Results 2022

యూపీఎస్సీ (యూనియన్ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్) సివిల్ సర్వీసెస్‌ మెయిన్స్‌ ఫలితాలు మంగళవారం (డిసెంబర్‌ 6)న విడుదలయ్యాయి. మెయిన్స్‌ రాత పరీక్షకు హాజరైనవారు అధికారిక వెబ్‌సైట్‌upsc.gov.in లేదా upsconline.nic.inలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ రాత పరీక్షలు సెప్టెంబర్‌ 16 నుంచి 25 వరకు మొత్తం పది రోజుల పాటు దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించారు. మెయిన్స్‌లో అర్హత సాధించిన వారు తదుపరి దశ అయిన ఇంటర్వ్యూకి హాజరవవచ్చు. అనంతరం.. మెయిన్స్‌, ఇంటర్వ్యూలలో సాధించిన మొత్తం మార్కుల ఆధారంగా మెరిట్‌ జాబితా విడుదల అవుతుంది. ఉత్తమ ర్యాంక్‌ సాధించిన వారు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ ఇతర సెంట్రల్‌ సర్వీసులకు ఎంపికవుతారు.

ఇవి కూడా చదవండి



UPSC Civil Services Mains Result 2022 ఎలా చెక్‌ చేసుకోవాలంటే..

  • ముందుగా కమిషన్‌ అధికారిక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌ పేజ్‌లో కనిపించే యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ రిజల్ట్‌ 2022 లింక్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • అనంతరం రోల్‌ నంబర్‌, పేరు నమోదు చేసి, సబ్‌మిట్‌పై క్లిక్‌ చెయ్యాలి.
  • వెంటనే స్క్రీన్‌పై పీడీఎఫ్‌ ఫైల్‌ ఓపెన్‌ అవుతుంది.
  • పీడీఎఫ్‌ ఫైల్‌ను సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages