TSPSC Group 4: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. విభాగాల వారీగా పోస్టుల వివరాలివే | TSPSC releases notification for Group 4 jobs for filling 9,168 posts, applications start from December 23rd - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 1 December 2022

TSPSC Group 4: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. గ్రూప్‌ 4 నోటిఫికేషన్‌ వచ్చేసింది.. విభాగాల వారీగా పోస్టుల వివరాలివే | TSPSC releases notification for Group 4 jobs for filling 9,168 posts, applications start from December 23rd

తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 9,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

తెలంగాణ నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్ -4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 9,168 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ నెల 23 నుంచి జనవరి 12 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ల దాఖలుకు జనవరి 12 చివరి తేదీగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే లో పరీక్ష ఉండే అవకాశం ఉంది. గ్రూప్‌-4 నోటిఫికేషన్ లో ముఖ్యంగా మూడు కేటగిరీలకు సంబంధించిన పోస్టులును భర్తీ చేయనునుంది టీఎస్ పీఎస్సీ. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్‌ పోస్టులు 1,862, పంచాయితీరాజ్‌శాఖలో భారీ స్థాయిలో 1,245 పోస్టులు, 429 జూనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులు, 18 జూనియర్‌ ఆడిటర్‌ పోస్టులు ఉన్నాయి.

విభాగాల వారీగా..

ఇక విభాగాల వారీ విషయానికొస్తే.. అగ్రికల్చర్‌, కో ఆపరేటివ్ శాఖలో 44 పోస్టులు, పశు సంవర్ధక శాఖ, డైరీ డెవలప్ మెంట్‌లో 2, బీసీ వెల్ఫేర్‌లో 307, పౌర సరఫరాల శాఖలో 72, ఆర్థిక శాఖలో 255 మున్సిపల్, అర్బన్ డెవల్మెంట్ లో 2, 701 పోస్టులు, ఉన్నత విద్యా శాఖలో 742 పోస్టులు, రెవెన్యూ శాఖలో 2,077 ఎస్సీ వెల్ఫేర్ లో 474 పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే లేబర్ డిపార్ట్మెoట్ లో 128 పోస్టులు, ట్రైబల్ వెల్ఫేర్ లో 221 పోస్టులు, హోమ్ శాఖలో 133 పోస్టులు, పాఠశాల విద్యా శాఖలో 97 పోస్టులను పూరించనున్నారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌ను చూడవచ్చు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages