తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జాతర కొనసాగుతోంది. నిన్న గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా గ్రూప్ – 3 నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 పోస్టులను గ్రూప్-3 నోటిఫికేషన్…

Tspsc
తెలంగాణలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల జాతర కొనసాగుతోంది. నిన్న గ్రూప్ – 2 నోటిఫికేషన్ విడుదల కాగా.. తాజాగా గ్రూప్ – 3 నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 1,365 పోస్టులను గ్రూప్-3 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్‌పీస్సీ అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in అనే వెబ్‌సైట్‌ను చూడాలని సూచించింది.

Group 3 Notification
ఇప్పటికే గ్రూప్-1, గ్రూప్-4 నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలు కూడా త్వరలోనే విడుదల కానున్నాయి. హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మరోవైపు పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు పోలీసు కానిస్టేబుల్, ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ కొనసాగిస్తోంది. పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా ఫిజికల్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
No comments:
Post a Comment