Telangana Cabinet: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ శాఖలో మరో 4 వేల ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం.. | Telangana Cabinet Meet Decisions, CM KCR Key Announcement On Police Jobs Recruitment - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, 10 December 2022

Telangana Cabinet: నిరుద్యోగులకు కేసీఆర్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ శాఖలో మరో 4 వేల ఉద్యోగాల భర్తీకి క్యాబినెట్ ఆమోదం.. | Telangana Cabinet Meet Decisions, CM KCR Key Announcement On Police Jobs Recruitment

రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది.

Telangana Cabinet Meet key decisions: రాష్ట్ర పోలీసు శాఖలో నూతన ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ క్యాబినేట్ ఆమోదం తెలిపింది. శాంతిభద్రతల పరిరక్షణలో దేశానికి ఆదర్శంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రంలో పోలీసు శాఖను మరింత పటిష్టం చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది. శనివారం సీఎం కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెరుగుతున్న సాంకేతికత, మారుతున్న సామాజిక పరిస్థితులలో, నేరాల తీరు కూడా మారుతున్న నేపథ్యంలో నేరాల అదుపునకు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని, అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమించుకోవాలని కేసీఆర్ క్యాబినేట్ నిర్ణయించింది.

నార్కోటిక్ డ్రగ్స్, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్ ను దెబ్బతీస్తూ శాంతిభద్రతల సమస్యగా పరిణమిస్తున్నాయని క్యాబినేట్ చర్చించింది. డ్రగ్స్ నేరాలను అరికట్టి నిర్మూలించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు, కమాండ్ కంట్రోల్ సెంటర్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, తెలంగాణ సైబర్ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేయాలని క్యాబినేట్ నిర్ణయించింది.

ఇందుకు సంబంధించి నియామక ప్రక్రియ చర్యలు చేపట్టాలని రాష్ట్ర హోంశాఖను క్యాబినేట్ ఆదేశించింది. ఇంకా పోలీస్ స్టేషన్లలో కొత్త సర్కిల్, కొత్త డివిజన్లు ఏర్పాటుకు కేబినేట్ చర్చింది. వీటితోపాటు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో.. శాంతిభద్రతలను మరింతగా మెరుగు పరిచేందుకు, పోలీసు వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి, నూతన పోలీస్ స్టేషన్లు, నూతన సర్కిల్లు, నూతన డివిజన్ల ఏర్పాటుకు క్యాబినేట్ ఆమోదం తెలిపింది.

ఇవి కూడా చదవండి



మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages