RRB Group – D Results: విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఎలా చూడాలంటే.. - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 22 December 2022

RRB Group – D Results: విద్యార్థులకు అలర్ట్.. ఫలితాలు విడుదల.. ఎలా చూడాలంటే..

Rrb Results

రాత పరీక్ష రాసి.. ఫలితాల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆర్ఆర్బీ గుడ్ న్యూస్ చెప్పింది. దేశ వ్యాప్తంగా నిర్వహించిన ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌-డి పరీక్షల ఫలితాలు విడుదల చేసింది. జోన్ల వారీగా రిజల్ట్స్ ప్రకటించింది. ఫలితాల కోసం ఆర్ఆర్బీ ప్రధాన వెబ్ సైట్ ను చూడాలని కోరింది. జోన్ల వారీగా ఆర్‌ఆర్‌బీలు తమ అధికారిక వెబ్‌సైట్లలో విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే భోపాల్‌, గువాహటి జోన్ల ఫలితాలు విడుదలయ్యాయి. సికింద్రాబాద్‌ సహా మిగతా జోన్ల ఫలితాలు రావాల్సి ఉంది. రాత పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు 2023, జనవరిలో నిర్వహించే దేహధారుడ్య పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుందని వివరించింది. అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టాలని సూచించింది. పీఈటీ తేదీలను సంబంధిత ఆర్‌ఆర్‌బీలు త్వరలో వెల్లడించనున్నట్లు వివరించింది.

కాగా.. నాలుగేళ్ల క్రితం 16 ఆర్‌ఆర్‌బీల పరిధుల్లో 1,03,769 గ్రూప్-డి పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. వీటికి దాదాపు కోటి మందికి పైగా అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్‌ 11 వరకు ఆన్‌లైన్‌ విధానంలో రాత పరీక్షను వివిధ దశల్లో నిర్వహించారు. అక్టోబర్‌లో ఈ పరీక్ష ప్రాథమిక కీతో పాటు.. రెస్పాన్స్ షీట్‌ విడుదల చేశారు.

సాధారణంగా గ్రూప్‌-డి ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. ఇది ఇప్పటికే పూర్తవగా మరో రెండు దశలు జరగాల్సి ఉంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఫిజికల్ ఫిట్ నెస్ ఎగ్జామ్స్ ఉంటాయి. అందులో క్వాలిఫై అయిన వారు వైద్య పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ మూడు దశల్లో విజయవంతంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages