Indian GCCs Hiring: నిరుద్యోగులకు అలర్ట్! వచ్చే12 నెలల్లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఆ కోర్సులకు డిమాండ్‌! | Global Captive Centres to create over 3.64 lakh jobs in next 12 months in India: Report - Naukri Jobs - Telugu

Breaking

Home Top Ad

Post Top Ad

Thursday, 8 December 2022

Indian GCCs Hiring: నిరుద్యోగులకు అలర్ట్! వచ్చే12 నెలల్లో 3.64 లక్షల కొత్త ఉద్యోగాలు.. ఆ కోర్సులకు డిమాండ్‌! | Global Captive Centres to create over 3.64 lakh jobs in next 12 months in India: Report

గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్స్‌ (GCCs) రానున్న12 నెలల్లో దాదాపు 3.64 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ఇండియా క్యాప్టివేటింగ్‌ నివేదిక బుధవారం (డిసెంబర్‌ 7) వెల్లడించింది. ప్రస్తుతం..

గ్లోబల్‌ క్యాప్టివ్‌ సెంటర్స్‌ (GCCs) రానున్న12 నెలల్లో దాదాపు 3.64 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించనున్నట్లు ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ ఇండియా క్యాప్టివేటింగ్‌ నివేదిక బుధవారం (డిసెంబర్‌ 7) వెల్లడించింది. ప్రస్తుతం జీసీసీ సెక్టార్‌ 35.9 బిలియన్‌ డాలర్ల వద్ద కొనసాగుతోంది. 2026 నాటికి 60 నుంచి 85 బిలియన్‌ డాలర్లకు వృద్ధి సాధించాలనే లక్ష్యంతో తమ కంపెనీ వర్క్‌ ఫోర్స్‌ను పెంచుకునే యోచనలో ఉంది. కీలక గ్లోబల్‌ మార్కెట్‌లలో సర్వీస్‌ డిమండ్‌ (34 శాతం) పెరగడమే ఇందుకు ప్రధాన కారణం. సబ్‌సెక్టార్ పరంగా ఐటీ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ కన్సల్టింగ్‌ (33 శాతం), బీఎఫ్‌ఎస్‌ఐ (21 శాతం), ఇంటర్నెట్‌ అండ్‌ టెలికాం (16 శాతం) ఉద్యోగాలు పెరనున్నాయి. దేశంలో కొత్త ఉద్యోగాల సృష్టించే నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది.

గ్లోబల్‌ జీసీసీల కార్యకలాపాల్లో భారత్‌ దాదాపు 45 శాతం వాటా కలిగి ఉంది. భవిష్యత్‌లో ఈ వాటా మరింత పెరగొచ్చని ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సీఈఓ సచిన్‌ అలుగ్‌ తెలిపారు. ఈ రంగం నుంచి 2023లో 10.8 శాతం వృద్ధి (సీఏజీఆర్‌) నమోదు చేస్తుందన్నారు. ఈ క్రమంలో భారత్‌లో ట్యాలెంట్‌ ఉన్న వ్యక్తులకు డిమాండ్‌ పెరుగుతుందని అలుగ్ చెప్పారు. అపాక్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ బిజినెస్‌ లీడర్‌, ఎన్‌ఎల్‌బీ సర్వీసెస్‌ సర్వే ప్రకారం.. ప్రస్తుతం అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న జీసీసీ కంపెనీల్లో డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగ్, స్టాటిస్టికల్ అనాలిసిస్, UI/UX డిజైన్ వంటి డిజిటల్, మెషిన్ లెర్నింగ్ నైపుణ్యాలకు అత్యధిక డిమాండ్ ఉంది.అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్‌, హైదరాబాద్‌, కోల్‌కతా, ముంబయి, పుణెలకు చెందిన దాదాపు 211 జీసీసీ కంపెనీల్లో సర్వే చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. సర్వే చేసిన కంపెనీల్లో బ్యాంకింగ్‌, ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌, ఇన్సూరెన్స్ (BFSI), హెల్త్‌ కేర్‌ అండ్‌ ఫార్మాక్యూటికల్‌, ఇంటర్‌నెట్‌ అండ్‌ టెలికమ్‌, ఐటీ సాఫ్ట్‌వేర్‌ అండ్‌ కన్సల్టెంగ్‌, మ్యానుఫ్యాక్చరింగ్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, రిటైల్ రంగాల చెందిన కంపెనీలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి



మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి



No comments:

Post a Comment

Post Bottom Ad

Pages